Begin typing your search above and press return to search.

నాని మూవీ అక్కడ కూడా డిజాస్టరే

By:  Tupaki Desk   |   17 Dec 2020 1:01 PM GMT
నాని మూవీ అక్కడ కూడా డిజాస్టరే
X
నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి నటించిన V మూవీ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీలో రిలీజైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏడాది ఓటీటీలో రిలీజైన తెలుగు సినిమాల్లో ఎక్కువమంది వీక్షించిన మూవీగా నిలిచినప్పటికీ.. హిట్ టాక్ మాత్రం రాలేదు. సినిమా మొత్తం రొటీన్ రివేంజ్ డ్రామాతో నింపేశారనే విమర్శలు వినిపించాయి.

బుల్లితెరపైనా అదే రిజల్ట్..
తాజాగా ఓటీటీ నుంచి బుల్లితెరకు షిప్ట్ అయ్యింది ఈ మూవీ. జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ సినిమాను ప్రసారం చేశారు. కానీ.. కేవలం 6.8 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇతర సినిమాల రేటింగ్ తో కంపేర్ చేయడం అటుంచితే.. నాని గత సినిమాలతో పోల్చి చూసినా ఈ రేటింగ్ మరీ తక్కువగా ఉంది.

నాని గత చిత్రం గ్యాంగ్ లీడర్ కు 8.6 టీఆర్పీ రాగా.. అంతకంటే ముందు నటించిన జెర్సీ సినిమాకు 8.8 రేటింగ్ వచ్చింది. దానికి ముందు నాగార్జునతో కలిసి నటించిన సినిమా దేవదాస్ కు కూడా 8.3 టీఆర్పీ వచ్చింది. వీటితో పోల్చి చూస్తే V సినిమా టీవీ స్క్రీన్ పైన కూడా ఫెయిల్ అయినట్టే లెక్క అంటున్నారు.

ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్న కొన్ని రోజుల ముందే లాక్ డౌన్ పడింది. ఆ తర్వాత చాన్నాళ్లు ఎదురుచూసి, చివరకు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. అన్నట్టు.. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో కూడా విడుదలకాబోతోందట. మరి, అక్కడ ఎంతమంది చూస్తారో? ఈ మల్టీస్టారర్ ను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించాడు.