Begin typing your search above and press return to search.

చేతులు మారిన వరుణ్ సినిమా

By:  Tupaki Desk   |   28 Oct 2018 6:50 AM GMT
చేతులు మారిన వరుణ్ సినిమా
X
మొదట్లో మెగా హీరో అనే బ్రాండ్ తో లేనిపోని హీరోయిజం ఉన్న పాత్రలు ట్రై చేసి కొన్ని దెబ్బలు తిన్న వరుణ్ తేజ్ గత ఏడాది నుంచి సరైన ట్రాక్ లో పడ్డాడు. ఫిదా లాంటి అల్ టైం బ్లాక్ బస్టర్ ఒకటి ఖాతాలో వేసుకున్న వరుణ్ ఈ సంవత్సరం తొలిప్రేమతో మరో డీసెంట్ హిట్ కొట్టేసి అంతరిక్షంతో హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ స్పేస్ మూవీ డిసెంబర్ విడుదల కోసం ముస్తాబవుతోంది. అదితి రావు హైదరి-లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి సంకల్ప్ రెడ్డి దర్శకుడు.

దీని తర్వాత 14 రీల్స్ సంస్థ కోసం ఓ మూవీ కమిట్ అయ్యాడు వరుణ్. అప్పట్లో ఒకడుండేవాడుతో క్రిటిక్స్ ని సైతం మెప్పించిన సాగర్ చంద్ర చెప్పిన లైన్ బాగా నచ్చడంతో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. కాకపోతే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు అది 14 రీల్స్ టేకప్ చేయడం లేదట. యువి సంస్థ ద్వారా దీని నిర్మాణం జరగబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. కారణాలు బయటికి చెప్పలేదు కానీ ఇది ఇప్పుడు సోలోగా ఈ బ్యానర్ లోనే రూపొందనున్నట్టు ఫిలిం నగర్ టాక్. షూటింగ్ తదితర వివరాలు త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతం సాహోతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మరో సినిమా నిర్మాణంలో ఉన్న యువి సంస్థ ఇతర హీరోలతో వేగంగా సినిమాలు తీసే ప్రణాళికలో బిజీగా ఉందట.

అందులో భాగంగానే వరుణ్ సాగర్ చంద్ర ప్రాజెక్టును చేతుల్లోకి తీసుకున్నట్టు తెలిసింది. వచ్చే సంక్రాంతికి లేక వచ్చే ఆపై నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి బ్యానర్లలో విభిన్నమైన దర్శకులు కథలతో తానేంటో ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్న వరుణ్ తేజ్ మొత్తానికి కొత్త తరహా సినిమాలతో రేస్ లో దూసుకుపోయే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు.