Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ పై కన్నేసిన ఆ గ్యాంగ్

By:  Tupaki Desk   |   12 Jan 2018 5:00 AM GMT
హ్యాట్రిక్ పై కన్నేసిన ఆ గ్యాంగ్
X
మొన్నటి వరకు టాలీవుడ్ లో ఓ నాలుగు నిర్మాణ సంస్థల పేర్లే ఎక్కువగా వినిపించేయి. ఇక ఆ నలుగురు అనే నిర్మాతలు పేర్లు కూడా బయటకి వచ్చేయి. అయితే ఇప్పుడు హీరోల సపోర్ట్ తో వస్తోన్న కొన్ని ప్రొడక్షన్స్ రేంజ్ పెరుగుతోంది. ఆ నాలుగురుకి ఈ నిర్మాత సంస్థ వ్యవస్థాపకులు గట్టిపోటీని ఇస్తున్నారు. వారు ఎవరో కాదు యూవీ క్రియేషన్స్ వారే. ప్రభాస్ ఫ్రెండ్స్ వంశీ ప్రమోద్ లు ఇప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలుగా కొనసాగుతున్నారు.

2013 మిర్చి సినిమాతో స్టార్ట్ అయిన వీరి ప్రయాణం మంచి విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని సినిమాలు మంచి లాభాలను అందించాయి. ఫెస్టివల్స్ కి అయితే ఎదో ఒక సినిమాని రిలీజ్ చేసి స్టార్ హీరోల సినిమాలకు గట్టిపోటీని ఇస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో మంచి హిట్స్ అందుకున్నారు. రన్ రాజా రన్ - ఎక్స్ ప్రెస్ రాజా వంటి సినిమాలు పొంగల్ కి స్టార్ హీరోలతో పోటీపడింది. ఇక ఈ సంక్రాంతి కి కూడా యూవీ గ్యాంగ్ తో రాబోతోంది. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది.

బాలీవుడ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన సూర్య గ్యాంగ్ తెలుగులో డబ్ అవుతోంది. అయితే ఈ సినిమాపై కోలీవుడ్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుగులో కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అజ్ఞాతవాసి మిక్సీడ్ టాక్ రావడంతో ఓ వర్గం ప్రేక్షకుల కన్ను గ్యాంగ్ పై పడింది. శుక్రవారం జై సింహా కూడా రిలీజ్ కానుంది. మరి ఈ పోటీలో యూవీ క్రియేషన్స్ ఎంతవరకు విజయం అందుకుంటుందో చూడలి.