Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ ఫస్ట్ బిగ్ మూవీ అదే..

By:  Tupaki Desk   |   20 Nov 2016 9:43 AM GMT
విజయ్ దేవరకొండ ఫస్ట్ బిగ్ మూవీ అదే..
X
‘పెళ్లిచూపులు’ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేశాడు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. అప్పటికే అతను చేస్తున్న రెండు సినిమాలకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. కొత్తగా రెండు మూడు పెద్ద బేనర్లలో సినిమాలు చేసే అవకాశం లభించింది. వీటిలో విజయ్ ముందు చేయబోయే పెద్ద సినిమా యువి క్రియేషన్స్ బేనర్లోనే. ఈ సినిమాకు స్క్రిప్టు రెడీ అయింది. ఒక కొత్త దర్శకుడితో ఈ సినిమా ఫైనలైజ్ అయింది. ఇది హార్రర్ కామెడీ మూవీ అని సమాచారం. యువి క్రియేషన్స్ బేనర్ స్థాయికి తగ్గట్లే కొంచెం భారీ స్థాయిలోనే ఈ చిత్రాన్ని చేయబోతున్నారట. స్క్రిప్టు చాలా బాగా వచ్చిందని చెబుతున్నారు.

మధ్యలో హార్రర్ కామెడీలు కొంచెం మొహం మొత్తేసినట్లు అనిపించినా.. ఆ జానర్ సినిమాల జోరు తగ్గట్లేదు. గత ఏడాది ‘రాజు గారి గది’ మంచి విజయం సాధించగా.. లేటెస్టుగా కొంచెం హార్రర్ కామెడీ ఛాయలున్న ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా పెద్ద రేంజ్ హిట్ అయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు అల్లరి నరేష్ కూడా ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’తో త్వరలోనే ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరో సైతం హార్రర్ కామెడీ వైపు చూస్తుండటం విశేషమే. ఈ నేపథ్యంలోనే యువి క్రియేషన్స్ వాళ్లు కూడా విజయ్ తో హార్రర్ కామెడీ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇక విజయ్ కొత్త సినిమా ‘ద్వారక’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ‘అర్జున్ రెడ్డి’ షూటింగ్ చివరి దశలో ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/