Begin typing your search above and press return to search.
రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో రాబోతున్న యూవీ క్రియేషన్స్...?
By: Tupaki Desk | 2 Oct 2020 11:00 PM ISTప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన యూవీ క్రియేషన్స్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతోంది. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా తీస్తున్నారు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'రాధే శ్యామ్' అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న యూవీ వారు.. త్వరలోనే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మేర్లపాక గాంధీ ఇంతకముందు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ హీరోగా 'ఎక్సప్రెస్ రాజా' సినిమా తెరకెక్కించాడు. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోతో తీయబోయే ప్రాజెక్ట్ బాధ్యతలు మేర్లపాక గాంధీకి ఇవ్వాలని యూవీ టీమ్ అనుకుంటున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.
ప్రస్తుతం మేర్లపాక గాంధీ యూత్ స్టార్ నితిన్ తో 'అంధాదున్' మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డిలు మరియు ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే తెలుగు 'అంధాదున్' ని కంప్లీట్ చేసి.. వీలైనంత త్వరగా యూవీ ప్రొడక్షన్ లో సినిమా తీయాలని ప్రొడ్యూసర్స్ కోరుతున్నారట. ఈ ప్రాజెక్ట్ లో హీరో వరుణ్ తేజ్ అని సినీ వర్గాల్లో అంటున్నారు. దీంతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా యూవీ క్రియేషన్స్ ఓ మూవీ ప్లాన్ చేస్తుందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని.. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్.' 'ఆచార్య' చిత్రాల్లో నటిస్తున్న చరణ్.. తదుపరి సినిమా ఇదేనని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.