Begin typing your search above and press return to search.

ఓటీటీలో యువ‌హీరోల‌కు బూస్ట్ ఇస్తున్న దిగ్గ‌జం

By:  Tupaki Desk   |   15 July 2020 3:40 PM IST
ఓటీటీలో యువ‌హీరోల‌కు బూస్ట్ ఇస్తున్న దిగ్గ‌జం
X
ఓటీటీ కొత్త దారుల్ని తెరుస్తోంది. ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాల‌కు ఆస్కారం ఉంది కాబ‌ట్టి ఈ వేదిక‌పై న‌వ‌త‌రం స్టార్ల‌ను ఎంక‌రేజ్ చేసేందుకు ఆస్కారం దొరుకుతోంది. ప్ర‌స్తుతం బ‌డా నిర్మాణ సంస్థ‌ల‌న్నీ చోటా మోటా హీరోల్ని ఎంపిక చేసుకుని వారి కోసం ఓటీటీ క‌థ‌ల్ని వండి వారుస్తూ చ‌క్క‌ని ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్నాయి. చిన్న సైజ్ ద‌ర్శ‌కుల‌కు ఇదో భ‌రోసాగానూ మారుతోంది.

ఓటీటీ మార్కెట్ రేంజుకు స‌రిప‌డే హీరోలు దొరికితే అగ్ర నిర్మాణ సంస్థ‌లు సైతం అస్స‌లు విడిచిపెట్ట‌డం లేదు. పైగా లాక్ డౌన్ వ‌ల్ల సిటీ ఔట్ స్క‌ర్ట్స్ లో రిసార్టులు.. హోట‌ళ్లు ఖాళీగా ఉండ‌డంతో హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు .. బూత్ బంగ్లా సినిమాల‌కు ఆస్కారం క‌లుగుతోంది. కంటెంట్ ఉంటే స్టార్లు ఎవ‌రు? అన్న‌ది చూడ‌కుండా ఓటీటీ వేదిక‌ల‌కు ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఆ కోవ‌లోనే ప్ర‌స్తుతం యువి క్రియేషన్స్ సంస్థ ఓ ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాని ప్లాన్ చేస్తోంది.

ఇందులో ఇద్దరు యువ‌క‌థానాయ‌కుల‌కు యువీ సంస్థ అవ‌కాశం క‌ల్పించింది. దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు `పేప‌ర్ బోయ్` ఫేం సంతోష్ శోభన్ ... న‌టుడు బ్రహ్మజీ కుమారుడు సంజయ్ (పిట్ట కథ‌ ఫేమ్) ప్ర‌ధాన పాత్ర‌ల్లో `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్` ఫేం మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తాజా సినిమాని ప్లాన్ చేస్తున్నారు. విశాఖ బీచ్ ప‌రిస‌రాల్లో ఈ మూవీ షూటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఇదో యూత్ ఫుల్ థ్రిల్లింగ్ ఎంట‌ర్ టైన‌ర్ అని వెల్ల‌డైంది.