Begin typing your search above and press return to search.
అమెరికాలో తుమ్మితే టాలీవుడ్ ఉలిక్కిపాటు
By: Tupaki Desk | 24 July 2020 10:15 AM ISTమహమ్మారీ విలయం అన్నిచోట్లా అల్లాడిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా-ఇండియాలో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. దేశంలో నిరంతరం వేలాది కేసులు నమోదవుతుంటే ఏం చేయాలో పాలుపోని స్థితి నెలకొంది. కారణం ఏదైనా ఈ ప్రభావం సినీరంగంపైనా థియేటర్ వ్యవస్థపైనా దారుణంగా పడిందని విశ్లేషిస్తున్నారు. ఇండియాలో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకుంటాయా? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది.
కనీసం అమెరికా సహా విదేశాల్లో అయినా థియేటర్లు తెరిచారా అంటే దానికి ఆన్సర్ దొరకడం లేదు. గత కొంతకాలంగా అమెరికా ఏఎంసీ థియేటర్ల చైన్ ని అమెజాన్ వాళ్లు కొనేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఆ డీల్ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ రాలేదు ఇంకా. ఆ క్రమంలోనే తాజాగా అమెరికాలో తమ థియేటర్లను ఆగస్టు నెలాఖరు వరకూ తెరిచేది లేదని ప్రఖ్యాత ఏఎంసీ చైన్ ప్రకటించింది. నిజానికి జూలై 31 నాటికి తెరిచేస్తామని వీళ్లు ఇంతకుముందు వెల్లడించినా అమెరికాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడే తెరిచేది లేదని ప్రకటించేశారు.
దీంతో ఆగస్ట్ మిడ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ములన్- టెనెట్ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలు మరోసారి వాయిదా ఫర్వంలో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్కార్ గ్రహీత క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన టెనెట్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నా.. ఇప్పుడిలా సంక్షోభం వల్ల నిర్మాతలు తీవ్రంగానే నష్టపోవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అమెరికా పరిస్థితి ఇలా ఉంటే బ్రిటన్ కి చెందిన యుకే సినీవరల్డ్ పీఎల్.సీ అమెరికాలో తమ థియేటర్లను తెరిచే ఆలోచనను ఆగస్ట్ మిడ్ వరకూ వాయిదా వేసుకున్నట్టు ప్రకటించింది. సంస్థ ఇతర కార్యకలాపాలు యథావిథిగా కొనసాగినా థియేటర్లు తెరవమని వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్ లో రీగల్ సినిమాస్ ఇదేవిధమైన నిర్ణయాన్ని ప్రకటించింది. యూరఫ్ లో ఏఎంసీ థియేటర్లు మూడింట ఒక వంతు నడుస్తున్నాయి. అక్కడా టెనెట్ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఇటీవల తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్ పెరగడంతో అక్కడ ఏం జరిగినా ఇక్కడ టాలీవుడ్ వర్గాల్లో ఉలిక్కిపాటు తప్పడం లేదు. తాజా ప్రకటనతో ఆ ఒక్క ఆశా మిగలనట్టే అయ్యింది.