Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆర‌డుగుల బికినీ బుల్లెట్టు

By:  Tupaki Desk   |   30 March 2020 12:33 PM GMT
ఫోటో స్టోరి: ఆర‌డుగుల బికినీ బుల్లెట్టు
X
ఈడు ఆర‌డుగుల బుల్లెట్టు!! అంటూ దేవీశ్రీ వినిపించిన సౌండింగ్ ఇంకా చెవిలోంచి దూరంగా పోలేదు. ఇంకా రింగ్ మంటూనే ఉంది. ఇక్క‌డ బులుగు జిలుగు స‌ముద్రం గట్టున‌ ఈ బుల్లెట్టు ఎవ‌రో కానీ పిచ్చెక్కిస్తోంది. నిలువెత్తు బులుగు బికినీలో స‌ముద్రుడికే చెమ‌ట‌లు ప‌ట్టించేస్తోంది. అస‌లే బీచ్ ప‌రిస‌రాల్లో స్విమ్మింగ్ పూల్.. దాంతో పూల్ క‌ల‌ర్ మొత్తం బులుగు రంగులోనే క‌నిపిస్తోంది.

బీచ్ స్విమ్మింగ్ పూల్స్ .. బీచ్ రిసార్ట్స్ .. బీచ్ ఫామ్ హౌస్ లు ఇవ‌న్నీ ఇలాంటి వాళ్ల‌కోస‌మేనా పుట్టుకొచ్చేది అన్నంత‌గా ఆ ప‌రిస‌రాలు వేడెక్కించేస్తున్నాయ్. ఇంత‌కీ ఊర్వశి కొంటె కుర్రాళ్ల‌కు ఏమ‌ని సిగ్న‌ల్స్ ఇస్తోంది? అంటే.... ఇంత‌గా వేడెక్కించే ప‌రువాలు ఉన్నా.. ఎవ‌రూ క‌నీసం ఇటువైపు అయినా చూడ‌రేం? క‌నిక‌రించి ఒక్క ఆఫ‌ర్ అయినా ఇవ్వ‌రేం? అంటూ ఆత్రంగానే క‌నిపిస్తోంది. నిలువెత్తు చింతామ‌ణి ప్ర‌తిరూపంలా .. బికినీ బుల్లెట్టులా క‌వ్విస్తున్నా ఎవ‌రూ ఎందుక‌ని ప‌ట్టించుకోవ‌డం లేదు?

ఇప్ప‌టికిప్పుడు సౌత్ లో ఛాన్స్ దొర‌కాలే కానీ ఇటువైపు దూసుకొచ్చేందుకు ఎంతో ఆశ‌గానే ఎదురు చూస్తోంది. మ‌న స్టార్ హీరోలు.. డైరెక్ట‌ర్ల చూపు ఇంకా ఈ బికినీ బుల్లెట్టు పైకి ప్ర‌స‌రించిన‌ట్టు లేదు. లేటెస్ట్ ఫోటోషూట్ నుంచి ఛ‌మ‌క్కు లాంటి ఫోటో ఇది. ప్ర‌స్తుతం వాట్సాపుల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఊర్వ‌శి ప్ర‌స్తుతం 'వ‌ర్జిన్ భానుప్రియ' అనే చిత్రంలో న‌టిస్తోంది. అజ‌య్ లోహాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ శ్రేయాన్స్ మ‌హేంద్ర ద‌రివాలా నిర్మిస్తున్నారు. జూన్ లో రిలీజ్ కానుంది. క‌రోనా లాకౌట్ వ‌ల్ల షెడ్యూల్ మారుతుందేమో చూడాలి.