Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బుర‌ద‌లో బొమ్మిడాయిలా నోరూరిస్తోంది!

By:  Tupaki Desk   |   15 Jun 2021 4:30 AM GMT
ఫోటో స్టోరి: బుర‌ద‌లో బొమ్మిడాయిలా నోరూరిస్తోంది!
X
అందానికి అందం వేడెక్కించే ఒంపుసొంపుల‌తో కుర్ర‌కారు మ‌తి చెడ‌గొట్ట‌డంలో హేట్ స్టోరి బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా త‌ర్వాతే. ఈ భామ నిరంత‌ర ఇన్ స్టా ట్రీట్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. జిమ్ యోగా సెష‌న్స్ నుంచి నిరంత‌రం ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తూ హేట్ స్టోరి4 భామ‌ అగ్గి రాజేస్తోంది. ఇంత‌కుముందు మాల్దీవుల విహారం నుంచి గోవా బీచ్ నుంచి బికినీ షూట్లను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి.

తాజాగా మ‌రోసారి క్రియేటివ్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. ఈసారి `బుర‌ద స్నానం` కాన్సెప్ట్ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. బుర‌ద‌తో క‌ప్ప‌బ‌డిన‌ ఊర్వ‌శి ఫోటోగ్రాఫ్ ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. సోమవారం నాడు తన బుర‌ద మట్టి స్నానాల‌ సెషన్ నుంచి ఈ కొత్త ఫోటోను పంచుకుంది. ``నా అభిమాన మడ్ బాత్ స్పా థెరపీ`` అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. ఎర్ర బురదను ఒళ్లంతా పూసుకుని ఊర్వ‌శి కుర్చీపై విశ్రాంతి తీసుకుంటోంది. బుర‌ద‌లో బొమ్మిడాయిలా ఊరిస్తోంది.. ఎవ‌రీ భామ‌! అంటూ అభిమానులు ఈ ఫోటోకి వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు.

స్పెయిన్ లోని బాలెరిక్ ద్వీపాల గురించి ఊర్వ‌శి ప్రస్తావిస్తూ.. ``బాలేరిక్ బీచ్ ఎర్ర బురదను ఆస్వాధించడం ఇష్టమ‌ని.. బురద స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రోమన్ ప్రేమ దేవత వీనస్ మ‌డ్ బాత్ ని అద్దంగా భావించింది.. మ‌ట్టిలో ఖనిజ సంపద‌తో చికిత్స ఛ‌ర్మానికి మంచిదని ప్ర‌జ‌లు భావిస్తార‌ని తెలిపింది.

మిస్ ఇండియా (యూనివర్స్)గా కిరీటం ద‌క్కించుకున్న ఊర్వ‌శి.. అటుపై బుల్లితెర‌పై అడుగు పెట్టి టీవీ సీరియ‌ల్స్ తో పాపుల‌రైంది. టాప్ మోడ‌ల్ గానూ రాణించింది. సింగ్ సాబ్ ది గ్రేట్.. గ్రేట్ గ్రాండ్ మస్తి- హేట్ స్టోరీ 4 - రేస్ 3 వంటి చిత్రాలలో నటించారు. చివరిసారిగా వర్జిన్ భానుప్రియలో కనిపించింది. ఇది స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం జీ 5 లో విడుదలైంది. త‌దుప‌రి ఊర్వ‌శి ప‌లు క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. సౌత్ లో అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప‌లో ఐట‌మ్ నంబ‌ర్ చేయ‌నుంది. అలాగే గోపిచంద్ సీటీమార్ లోనూ ఊర్వ‌శి స్పెష‌ల్ నంబ‌ర్ తో అల‌రించ‌నుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.