Begin typing your search above and press return to search.

మ‌హేష్ అయితే ఫ్రీనే అనేసింది

By:  Tupaki Desk   |   10 April 2017 1:58 PM GMT
మ‌హేష్ అయితే ఫ్రీనే అనేసింది
X
స్టార్ హీరోల ప‌క్క‌న ఛాన్స్ అంటే కొంద‌రు హీరోయిన్లు పారితోష‌కం త‌గ్గించుకోవ‌డానికి కూడా వెనుకాడ‌రు. ఐతే ముంబ‌యి భామ ఊర్వ‌శి రౌతెలా అయితే ఏకంగా ఫ్రీగా న‌టించేయ‌డానికి రెడీ అంటోంది. మ‌హేష్ బాబు సినిమాకు మాత్రమే ఆమె ఈ బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించింది. మ‌హేష్ తో సినిమా ఛాన్స్ ఇప్పించాలే కానీ.. ఫ్రీగా ఆ సినిమాలో న‌టించేస్తానంటూ ఆమె నిర్మాత‌ల‌కు ఎర వేస్తోంది.

ఇటీవ‌ల విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన టి.సుబ్బిరామిరెడ్డి అవార్డుల వేడుక‌కు హాజ‌రైన ఊర్వ‌శి.. మ‌హేష్ మీద త‌న‌కున్న అభిమానాన్ని బ‌య‌ట‌పెట్టుకుంది. త‌న‌కు మ‌హేష్ అంటే చాలా ఇష్ట‌మ‌ని.. అత‌డితో క‌లిసి న‌టించాల‌ని ఆశ‌గా ఉంద‌ని.. త‌న‌తో సినిమా అంటే పారితోష‌కం గురించి కూడా ఆలోచించ‌న‌ని.. ఉచితంగా న‌టిస్తాన‌ని ఆమె తెలిపింది. ద‌క్షిణాదిన త‌న ఫేవ‌రెట్ హీరో మ‌హేషే అని ఆమె తెలిపింది.

15 ఏళ్ల‌కే మోడ‌లింగ్ మొద‌లుపెట్టిన ఊర్వ‌శి.. బాలీవుడ్లో ఐదారు సినిమాల్లో న‌టించింది. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో వార్త‌ల్లో ఉండే ఊర్వ‌శికి సినిమాల్లో అంత‌గా క‌లిసిరాలేదు. ద‌క్షిణాదిన సినిమా అవ‌కాశాల కోసం చాలానే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లుంది కానీ.. అవేమీ ఫ‌లితాన్నివ్వ‌లేదు. మ‌రి ఈ ఫ్రీ ఆఫ‌ర్ త‌ర్వాత అయినా ఎవ‌రైనా ఆమెకు ఛాన్స్ ఇస్తారేమో చూద్దాం మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/