Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఊర్వశి మెరుపులు అదిరే

By:  Tupaki Desk   |   12 March 2018 5:49 AM GMT
ఫోటో స్టోరి: ఊర్వశి మెరుపులు అదిరే
X
అందంగా ఉండే ప్రతి అమ్మాయిని రంభ ఊర్వశి మేనకలతో పోల్చడానికి వీలు పడదు. ఎదో ముద్దుగా పిలిచినా లేటెస్ట్ ఫ్యాషన్ వరల్డ్ లో మాత్రం అలాంటి గుర్తింపు దక్కించుకోవాలంటే కొన్ని పరిధులు ఉన్నాయి. అలాంటి గుర్తింపు అందుకోవడం కోసం లేటెస్ట్ మోడల్స్ చాలా కష్ట పడతారు. ఫిజికల్ మెంటల్ గా అందంపై చాలా ఏకాగ్రత వహిస్తారు. అలాంటి వారిలో లేటెస్ట్ గా ట్రెండ్ అవుతోన్న బ్యూటీ ఊర్వశి రౌతేలా.

ఈ బ్యూటీ పేరుకు తగ్గట్టుగానే చాలా అందమైన భామ. బాలీవుడ్ లో ఈ బ్యూటీ గ్లామర్ దెబ్బకు ప్రస్తుతం చాలా మంది హీరోయిన్స్ ఫెడ్ అవుట్ అవుతున్నారు. ఊర్వశి స్క్రీన్ పై కనిపించిందంటే చాలు కుర్రకారు తల పక్కకి తిప్పారంతే. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. లేటెస్ట్ గా FHM మ్యాగజైన్ కవర్ పేజ్ పై ఉర్వశి సెగలు పుట్టించే విదంగా స్టిల్ ఇచ్చింది. షార్ట్ జీన్స్ వైట్ షర్ట్ లో నడుమందలను ఓ లెవెల్లో మెరుపులు మెరిపించింది.

రీసెంట్ గా వచ్చిన హెట్ స్టోరీ 4 లో కూడా అమ్మడు తన అందాలను చాలా సెక్సీగా ప్రజెంట్ చేసింది. అయితే సినిమా మాత్రం అనుకుంన్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. కానీ ఉర్వశి అందాలు మాత్రం వృధా అవ్వలేదు. చాలా వరకు ఆ బ్యూటీ వల్లనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఉర్వశి సీన్స్ ఓక్కటే ప్లస్ పాయింట్ అనేలా రివ్యూలలో కూడా క్రిటిక్స్ స్పెషల్ గా మెన్షన్ చేశారు. ఇక ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం రేస్ 3 సినిమాలో నటిస్తోంది.