Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: ఊర్వశి దిగొచ్చేసిందా!!

By:  Tupaki Desk   |   10 March 2018 10:36 AM GMT
ఫోటోస్టోరీ: ఊర్వశి దిగొచ్చేసిందా!!
X
అందం గురించి మాట్లాడుకుంటే.. స్వర్గంలో నృత్యం ఆడే రంభ-ఊర్వశి-మేనకలతోనే మొదలుపెట్టడం పద్ధతిగా ఉంటుంది. అద్భుతమైన అందగత్తెలు కాబట్టే వారి గురించి ఇప్పటికీ ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అయితే.. ఆ లోకంలోనే కాకుండా ఇలలో కూడా వీరిని మరిపించే అందగత్తెలు ఉన్నారు. గ్లామర్ వరల్డ్ వీరిని వెతికి పట్టుకొచ్చి మరీ మనకు చూపిస్తూ ఉంటుంది.

పేరుకు తగినట్లుగానే ఉండే అందాల తార ఊర్వశి రౌతేలా.. మూడేళ్ల క్రితమే మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ భామను చూసిన ఎవరైనా సరే.. తగిన గౌరవం అనుకోవాల్సిందే. అలాంటి అద్భుత సౌందర్యరాశి అయిన ఊర్వశి రౌతేలా ఇప్పుడు హేట్ స్టోరీ4 అనే మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అందాల ప్రదర్శనను తారా స్థాయిలో చేసిన ఓ ఫోటో షూట్ ను కూడా చూపించేసింది. ఇప్పటివరకూ చాలా సార్లే సోకులను ప్రదర్శించింది కానీ.. మరీ ఇలా కనురెప్ప వేయడం మానేసి చూసేంతటి స్థాయిలో అయితే ఎప్పుడూ దర్శనం ఇవ్వలేదు.

చిన్నపాటి డ్రెస్సులు వేసుకున్నా సరే.. వాటికి కూడా అందాన్ని అంటగట్టేంతటి మెరుపులు విరజిమ్ముతున్న సొగసులను.. మరింత పొందికగా ప్రదర్శనకు పెట్టేసింది ఊర్వశి. ప్రస్తుతం ఈ ఫోటోలను కుర్రాళ్లు షేర్ చేసుకుంటూ.. తెగ ఆనందించేస్తున్నారు. ఊర్వశి రౌతేలా అందాలను పద్ధతిగా తమ సెల్ ఫోన్లలో భద్రపరచుకుంటున్నారు.