Begin typing your search above and press return to search.

దొంగ మిస్‌ ఇండియాను తీసుకున్నాడా?

By:  Tupaki Desk   |   1 July 2015 7:30 PM GMT
దొంగ మిస్‌ ఇండియాను తీసుకున్నాడా?
X
మీకు ఊర్వశీ రౌతెలా గుర్తుందా? ఈ అమ్మడు పేరు వినే ఉంటారే.. ఈ బంగారం ఓ హాట్‌ మోడల్‌. కాని విక్కీపీడియా లాంటి వెబ్‌సైట్స్‌లో ఎన్ని సంవత్సరాల నుండి చూసినా కూడా ఈమె వయస్సు 21 ఏళ్ళు అనే ఉంటుంది. అసలు ఏజ్‌ పెరగకుండా ఇన్నేళ్ళ ఒక అమ్మాయి ఒకే వయస్సులో ఎలా ఉండిపోతుంది అనే ఎవ్వరికైనా ఇట్టే సందేహం రావల్సిందే. ఈ సందేహం మనకి వచ్చినా రాకపోయినా గతంలో మిస్‌ ఇండియా వారికి మాత్రం వచ్చింది.

ఈ భామ మిస్‌ ఇండియా కిరీటం గెలిచింది. అందగత్తె. మాటకారి. మాంచి డ్యాన్సర్‌. మంచి సమయస్ఫూర్తి ఉంది. ఇంకేం కావాలి కిరీటం ఇవ్వడానికి? సో ఇచ్చేశారు. కాని ఏజ్‌ను తప్పుగా చెప్పిందని తెలియడంతో తరువాత ఆమె కిరీటాన్ని లాగేసుకున్నారు కూడా. ఈ మధ్యనే అమ్మడు ''సాబ్‌ సింగ్‌ గ్రేట్‌'' అనే సినిమాతో హిందీలో హీరోయిన్‌గా పరిచయమైంది. అంతకంటే పెద్ద విషయం ఏంటంటే.. తన చిలిపి కళ్లతో సోగ చూపులతో సల్మాన్‌ ఖాన్‌ను కూడా పడేసిందట. అందుకే ఇప్పుడు వచ్చే సంవత్సరం ఈద్‌కు రిలీజ్‌ డేట్‌ ఫిక్సయిన ''సుల్తాన్‌'' సినిమాలో ఈ భామను హీరోయిన్‌గా తీసుకోవాలని సల్లూ భాయ్‌ చూస్తున్నాడు.

అసలు ఈ పాత్రకు మహేష్‌ బాబు హీరోయిన్‌ కృతి సేనన్‌ను తీసుకోవాలని మొదట్లో ప్లాన్‌ చేశారు. కాని విశేషం ఏంటంటే.. చివరకు ఊర్వశి రౌతెలాను తీసుకున్నారని తెలుస్తోంది. అయితే సల్మాన్‌ రోజుకు ఒక్కో పేరు జపం చేయడంతో మనోడు ఎవరిని తీసుకున్నాడో తెలియట్లేదు.