Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: స్మార్ట్ సొంపుల ఊర్వశి

By:  Tupaki Desk   |   15 Sep 2017 7:42 AM GMT
ఫోటో స్టోరి: స్మార్ట్ సొంపుల ఊర్వశి
X
మాజీ మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతేలాకు ఇప్పటివరకూ సినిమా రంగం పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. నాలుగేళ్ల నుంచి ఇండస్ట్రీలో అయితే ఉంది కానీ.. ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కలేదు. కెరీర్ ను గాడిలో పెట్టుకోవడానికి కొన్ని మెట్లు దిగేసి.. గతేడాది గ్రేడ్ గ్రాండ్ మస్తీ అంటూ అడల్ట్ కంటెంట్ సినిమాలో కూడా నటించింది కానీ.. పైరసీ దెబ్బకి ఈ మూవీ అటకెక్కేసింది.

అయితే.. మోడలింగ్ పరంగా కానీ.. క్రేజ్ పరంగా కానీ ఊర్వశి రౌతేలాకు వచ్చిన లోటేమీ లేదు. తాజాగా ఓ మొబైల్ ఫోన్ లాంఛింగ్ కోసం ఈ భామను స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఆ ఈవెంట్ లో ఈ బ్యూటీ చీరకట్టులో భలే మెరిసిపోయింది. చైనా బ్రాండ్ కు ఇండియన్ శారీలో వచ్చి అమ్మడు చేసిన ప్రచారం బాగానే ఆకట్టుకుంది. అయితే.. అక్కడ కూడా తన మార్క్ అందాల టచ్ ను అద్భుతంగా ఇచ్చింది ఊర్వశి రౌతేలా. నడుం ఒంపులను ఈ సుందరి ప్రదర్శించిన తీరు అద్భుతం అనాల్సిందే.

నడుము ముడతలు స్పష్టంగా కనిపించేలా ఒంగి మరీ ఫోటోలకు పోజులు ఇచ్చేసింది. అమ్మడు పాల్గొన్న ఈవెంట్ లో లాంఛ్ చేసిన స్మార్ట్ ఫోన్ కంటే నున్నటి నడుమును చూపించి.. స్మార్ట్ ఒంపులను ప్రదర్శించి ఊర్వశి రౌతేలా.