Begin typing your search above and press return to search.

చుక్క‌లు చూపిస్తున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   3 March 2018 4:49 AM GMT
చుక్క‌లు చూపిస్తున్న హీరోయిన్
X
స్టార్ హీరోయిన్‌ లే టైమ్ కు వ‌చ్చి షూటింగ్‌ లు పూర్తి చేసుకుని వెళుతుంటే... అప్పుడ‌ప్పుడు అవ‌కాశాలు అందుకునే కొంత‌మంది హీరోయిన్లు మాత్రం... ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. గొంతెమ్మ కోర్కెలు కోరుతూ... షూటింగ్ స‌రిగా సాగ‌నీయ‌కుండా అడ్డుకుంటున్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అలాంటి వారిలో మొద‌టిస్థానం బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వ‌శి రౌతెలాకే ఇవ్వాలి. ఆమె ఇప్పుడు త‌న చిత్ర యూనిట్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

మోడ‌ల్ ఊర్వ‌ళి రౌతెలా ప్ర‌స్తుతం భానుమ‌తి అనే సినిమాలో న‌టిస్తోంది. మ‌హేంద్ర ద‌రివాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా. వ‌ర్జినిటీపై వ‌స్తున్న సినిమా ఇది. ఊర్వ‌శికి కోస్టార్‌ గా యంగ్ నటుడు గౌత‌మ్ గులాటి న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. ఈ షూటింగ్‌లో ఊర్వ‌శి ముప్ప‌తిప్ప‌లు పెడుతోంది. త‌న‌కు తాను ఎంచుకున్న కొన్ని ఫైవ్ స్టార్ హోట‌ల్స్ నుంచి ఫుడ్ తెప్పించాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. షూటింగ్ కువ‌స్తూ కారులో ప్ర‌యాణిస్తూనే... పీఏ చేత‌... ఆ రోజు త‌న‌కు కావాల్సిన మెనూ ని ఆర్డ‌ర్ ఇస్తోంది. షూటింగ్ జ‌రుగుతున్న ద‌గ్గ‌ర్లో ఉన్న రెస్టారెంట్‌ ల నుంచి కాకుండా... కొన్ని కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హోట‌ల్స్ నుంచి ఫుడ్ తెప్పించ‌మ‌ని గొడ‌వ చేస్తోంది. రోజుకు కేవ‌లం ఆమె ఫుడ్ బిల్లే అయిదువేల రూపాయ‌లు దాటిపోతోంద‌ట‌.

ఒక్కోసారి త‌న త‌ల్లిదండ్రుల‌కు కూడా ఫుడ్ బుక్ చేసి... చిత్ర యూనిట్ చేతే ఇంటికి చేరేలా చేస్తోంది. తాను తిన‌గా మిగిలిన ఆహారాన్ని కూడా ప్యాక్ చేసి ఇంటికి పంపేస్తోంది. ఆమె చీప్ ప్ర‌వ‌ర్త‌న‌కు చిత్ర‌యూనిట్ మొత్తం విసిగిపోతోంది. గంట‌న్న‌ర సేపు బ్రేక్ తీసుకుని... షూటింగ్ ముందుకు సాగ‌నీయ‌డం లేదు. ఊర్వ‌శి రౌతెలా అంటేనే ఇప్పుడు ఆ చిత్ర‌యూనిట్ చిరాకు ప‌డుతోంది. అమ్మ‌డు ప్ర‌వ‌ర్త‌న మార్చుకోక‌పోతే... ఇదే చివ‌రి సినిమా అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు.