Begin typing your search above and press return to search.

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ!

By:  Tupaki Desk   |   7 March 2022 12:30 AM GMT
మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ!
X
హేట్ స్టోరి 4 .. గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రాలతో మ‌త్తెక్కించిన బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా. మోడ‌లింగ్ .. బుల్లితెర‌ను ఏలిన ఈ బ్యూటీ అందాల రాణిగా కిరీటం గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ్యూటీ తొంద‌ర్లోనే తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెడుతోంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం సాగింది. బ‌న్ని న‌టించిన పుష్ప‌లో ఐట‌మ్ నంబ‌ర్ చేస్తుంద‌ని ప్ర‌చార‌మైనా కానీ అది కుద‌ర‌లేదు.

తాజా నివేదిక ప్రకారం.. బాలీవుడ్ ఐట‌మ్ బాంబ‌ర్ ఊర్వశి రౌతేలా నితిన్ హీరోగా న‌టిస్తున్న `మాచర్ల నియోజకవర్గం`లో ట్రీటివ్వ‌నుంద‌ని తెలిసింది. అధికారికంగా ఎటువంటి ధృవీకరణ లేకోయినా ఈ పొలిటికల్ డ్రామాలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో న‌ర్తించ‌నుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.

మాచర్ల నియోజకవర్గం టైటిల్ కి త‌గ్గ‌ట్టే రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమా. ఎం.ఎస్ రాజ శేఖర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ అందించ‌గా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి- నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. 29 ఏప్రిల్ 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బోల్డ్ కంటెంట్ తో విరుచుకుప‌డ‌డంలో ఊర్శశి త‌ర్వాతే. హ‌ద్దులు చెరిపేసి అందాల ఆర‌బోత‌తో వేడెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది అంటే మాస్ కి థియేట‌ర్ల‌లో జాత‌రే. ప్ర‌స్తుతం బ్లాక్ రోజ్ అనే తెలుగు చిత్రంలో న‌టిస్తోంది. పుష్ప 1లో మిస్స‌యినా పుష్ప 2 లో ఈ అమ్మ‌డి ట్రీట్ ఉండే ఛాన్సుంది. ప‌లు ఇత‌ర తెలుగు చిత్రాల్లోనూ ఊర్వ‌శి న‌టిస్తోంద‌న్న స‌మాచారం ఉంది. కానీ అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.