Begin typing your search above and press return to search.

ఈ ఊర్వశిని మనోళ్ళు దింపరేంటో

By:  Tupaki Desk   |   30 Jun 2016 1:35 PM GMT
ఈ ఊర్వశిని మనోళ్ళు దింపరేంటో
X
ఇప్పటివరకు చాలాసార్లు హైదరాబాద్‌ వచ్చింది మిస్ ఇండియా బ్యూటి ఊర్వశి రౌతేలా. అమ్మడు ఇక్కడ చాలా సినిమాలకు ఆడిషన్ ఇచ్చింది. అయినాసరే ఒక్కరు కూడా ఆమెను ఓకె అనలేదు. మెయిన్‌ లీడ్‌ గా కాకపోతే సెకండ్‌ హీరోయిన్‌ గా అయినా పాపను తీసుకోవచ్చుగా బాసూ?? అంతలా ఆమెలో టాలెంట్ ఏముంది అంటారా.. ఒక్కసారి ఆ పాటను చూడండి మరి.

హిందీలో మొన్నమధ్యన వచ్చిన సనమ్ రే సినిమాలో బికినీ అందాలతో మోత పెట్టించేసింది ఊర్వశి. ఆ తరువాత బాలీవుడ్‌ లో అనేక ఫోటోషూట్లతో మతిపోగొట్టేసిందిలే. ఇప్పుడు రితేశ్‌ దేశ్ముఖ్‌ రెగ్యులర్‌ గా చేసే ఎడల్ట్ కామెడీ.. ''గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ'' (మస్తీ సీక్వెల్‌ లో 3వ సినిమా) సినిమాలో.. ఊర్వశి మెయిన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం కావల్సినన్ని అందాలు దారబోసింది. అదిగో రేషమ్‌ కా రుమాల్‌ అనే పాటలో అయితే పిచ్చెత్తించింది అంతే. తెలుగులో మనోళ్లు హీరోయిన్లకు ఇచ్చే గ్లామరసం పాత్రలకు కరక్టుగా సరిపోతుంది కదూ. అందుకే అడిగేది.. ఈ ఊర్వశిని ఇంకా దింపరేంటి అని.

ఇదే విషయం ఊర్వశిని అడిగితే.. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో చాలా సినిమాలకు ఆడిషన్లు ఇస్తున్నా కాని.. ఎందుకో ఎక్కడా కన్ఫర్మేషన్‌ కాల్‌ మాత్రం రావట్లేదు అంటోంది. అది సంగతి.