Begin typing your search above and press return to search.

ప్రైస్‌ ట్యాగ్‌ మర్చి పోయిందా.. కావాలనే ఉంచిందా?

By:  Tupaki Desk   |   16 Oct 2021 4:31 PM GMT
ప్రైస్‌ ట్యాగ్‌ మర్చి పోయిందా.. కావాలనే ఉంచిందా?
X
బాలీవుడ్‌ తో పాటు సౌత్ లో అందరికి సుపరిచితురాలైన ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. ఈ అమ్మడు హాట్‌ షో విషయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క ఫొటో షూట్ కూడా ఈమెవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. హాట్‌ అందాల ఆరబోత లో ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా ఉండే ఈ అమ్మడు ఈసారి ఒక వింతైన విషయంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈసారి కూడా ఆమె డ్రస్ కారణంగానే ఆమె సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. అయితే ఈసారి ఆమె డ్రస్ హాట్‌ గా ఉండటం వల్ల కాదు. ఆమె డ్రస్ కు రేట్‌ ట్యాగ్‌ ను తీయక పోవడం వల్ల ఈసారి ఆమె వార్తల్లో నిలిచింది.

కొందరు సెలబ్రెటీలు వార్తల్లో నిలవడం కోసం కొన్ని సార్లు ఇలాంటి ట్రిక్స్ ను పాటిస్తూ ఉంటారు. మరి ఊర్వశి రౌతేలాకు పబ్లిసిటీకి కరువు లేదు. ఆమె ఎప్పుడు కూడా మీడియాలో ఉంటూనే ఉంటుంది. కనుక ఆమె రేట్ ట్యాగ్‌ తో ఫొటో ల్లో కనిపించి పరువు తీసుకుని మరీ వార్తల్లో నిలవాలని అనుకోదు. కనుక ఆమె కావాలని మాత్రం అలా చేసి ఉండదు అంటూ చాలా మంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే కొందరు మాత్రం ఆమె పబ్లిసిటీ కోసం ఇలాంటి పని చేసి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్‌ లో ఐటెం సాంగ్స్ తో పాటు అనేక రకాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్న ఈ అమ్మడు ఆమద్య ఒక తెలుగు వెబ్‌ సిరీస్ లో కూడా నటించింది. ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా ఇతర భాషలతో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కెమెరాలు కనిపిస్తే హాట్‌ ఫొటోలతో షో చేసే ఈ అమ్మడు ఈసారి తన డ్రస్ కు ఉన్న రేట్‌ ట్యాగ్‌ ను తీయకుండా అందరి దృష్టిని ఆకర్షించింది. నెట్టింట ఈమె ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. గతంలో ఇలాంటి చీప్ డ్రస్ ట్రిక్స్ తో సోషల్‌ మీడియాలో ఆమె వైరల్‌ అయ్యింది లేదు. ఇప్పుడు మాత్రం రేట్‌ ట్యాగ్ కారణంగా జనాలు ఆమె గురించి చర్చిస్తున్నారు.