Begin typing your search above and press return to search.

ఇంతందాన్ని ఎలా ద్వేషించేది?

By:  Tupaki Desk   |   15 Oct 2017 9:26 AM GMT
ఇంతందాన్ని ఎలా ద్వేషించేది?
X
ఎన్నేళ్లు గడిచినా బాలీవుడ్ జనాలకు ఎరోటిక్ సినిమాలపై అభిమానం తగ్గలేదు. పైగా ముందొచ్చిన సినిమాలకు మించి హిట్లు సాధిస్తుండటంతో ఫిలిం మేకర్స్ కూడా ఈ జోనర్ లో సినిమాలు తీయడానికి తెగ ఉత్సాహపడిపోతున్నారు. సింపుల్ స్టోరీ.. తక్కువ బడ్జెట్.. స్టార్ కాస్టింగ్ అస్సలే అక్కర్లేదు. ఈ సినిమాల సక్సెస్ కు కావాల్సిందల్లా అట్రాక్టివ్ హీరోయిన్ మాత్రమే.

ఎరోటిక్ సినిమాల్లో హేట్ స్టోరీ సిరీస్ కు ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఇప్పటికే ఇందులో మూడు సిరీస్ లు వచ్చాయి. ఈ మూడూ బాక్సాఫీస్ వద్ద బాగా వర్కవుట్ అయ్యాయి. దీంతో హేట్ స్టోరీ-4 సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు. ఈసారి హీరోయిన్ గా ఊర్వశి రౌతేలాను ఎంపిక చేశారు. హీరోయిన్ హాట్ లుక్ తో ఉన్న స్టిల్ తో టైటిల్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఊర్వశి రౌతేలాను చూస్తే సాక్షాత్తు దేవలోకం నుంచి ఊర్వశే దిగొచ్చిందా అన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాకు ఆమె ఏ మేరకు స్పెషల్ అస్సెట్ కానుందే ఈ ఒక్క స్టిల్ చూస్తేనే అర్ధమైపోతోంది. స్కిన్ టైట్ ప్యాంట్ - బ్లాక్ బికినీ టాప్ వేసుకుని మత్తెక్కించే చూపుల్తో ఊర్వశి అందరి మతులు పోగొట్టేసింది.

హేట్ స్టోరీ-4 సినిమాకు విశాల్ పాండ్యా దర్శకత్వం వహిస్తున్నాడు. హేట్ స్టోరీ పార్ట్ 2, పార్ట్ 3లకు కూడా విశాల్ పాండ్యానే డైరెక్షన్ చేశాడు. ఈ మూడు సినిమాల ప్రొడక్షన్ హౌస్ కూడా టి.సిరీస్ ఒక్కటే. హ్యాట్రిక్ విజయం సాధించాలన్న పట్టుదలతో ఈ టీం మొత్తం మరో సినిమా చేస్తున్నారు.