Begin typing your search above and press return to search.

క్రికెటర్‌ తో లవ్‌ వార్తలపై హీరోయిన్‌ సీరియస్‌

By:  Tupaki Desk   |   29 July 2019 10:56 AM IST
క్రికెటర్‌ తో లవ్‌ వార్తలపై హీరోయిన్‌ సీరియస్‌
X
సినీ తారలకు క్రీడాకారులకు మద్య స్నేహం.. ప్రేమ చాలా కామన్‌ గా ఉంటూనే ఉంది. టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హీరోయిన్‌ అనుష్కను వివాహం ఆడిన విషయం తెల్సిందే. అలాగే చాలా మంది టీం ఇండియా ఆటగాళ్లు హీరోయిన్స్‌ తో ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమద్య టీం ఇండియా ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్య మరియు నటి ఊర్వశి రౌతేలాలు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

తాజాగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ హార్దిక్‌ పాండ్య నుండి విడిపోయిన ఊర్వశి రౌతేలా ఇప్పుడు అతడి నుండి సాయం కోరుతుందని.. అతడు సాయం చేయాలని ఆశగా ఎదురు చూస్తుందనే టైటిల్‌ తో ఒక కథనంను ప్రసారం చేయడం జరిగింది. ఆ కథనంపై ఊర్వశి చాలా సీరియస్‌ అయ్యింది. సదరు వీడియో స్క్రీన్‌ షాట్‌ ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది.

ఇలాంటి వార్తలు రాసేప్పుడు ముందు వెనక ఆలోచించాలి. తనకు కుటుంబం ఉందని.. ఇలాంటి వార్తలు వచ్చిన సమయంలో వారికి నేను సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి తప్పుడు వార్తలు రాసి నాకు సమస్యలు తెచ్చి పెట్టవద్దు. ఒక విషయం గురించి రాసే సమయంలో దాని గురించి తెలుసుకోవాలని.. దాని వల్ల ఎదుటి వారు ఇబ్బంది పడతారనే కనీసం ఆలోచన చేయాలని కోరింది. మరెప్పుడు ఇలాంటి వార్తలు రాయవద్దని హెచ్చరించింది.