Begin typing your search above and press return to search.

ఫిల్మ్ ‌ఫేర్ 2021.. క‌ళ్ల‌న్నీ ఊర్వ‌శి ఉరుములు మెరుపుల‌పైనే!

By:  Tupaki Desk   |   29 March 2021 12:30 PM GMT
ఫిల్మ్ ‌ఫేర్ 2021.. క‌ళ్ల‌న్నీ ఊర్వ‌శి ఉరుములు మెరుపుల‌పైనే!
X
బాలీవుడ్ అందాల క‌థానాయిక ఊర్వ‌శి రౌతేలా రెగ్యుల‌ర్ ఫోటో ట్రీట్ గురించి తెలిసిందే. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ అమ్మ‌డు నిరంత‌రం వేడెక్కించే ఫోటోలు వీడియోల్ని షేర్ చేస్తూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా 66వ ఫిలింఫేర్ అవార్డుల కార్య‌క్ర‌మంలో ఊర్వ‌శి అంద‌చందాలు డిజైన‌ర్ లుక్ యువ‌త‌రంలో అగ్గి రాజేసింది.

ఊర్వ‌శి నెవ్వ‌ర్ బిఫోర్ లుక్ తో స్ట‌న్నింగ్ అనిపించింది. వైన్ కలర్ సీక్వెన్స్ శాటిన్ గౌనులో ఫిల్మ్ ‌ఫేర్ 2021 రెడ్ కార్పెట్ పై మెరుపులు మెరిపించింది. ఊర్వ‌శి అంద‌చందాల‌కు ఈవెంట్ అతిథులంతా స్ట‌న్న‌యిపోయి త‌న‌నే చూశారంటే అతిశ‌యోక్తి కాదు. ఊర్వ‌శి నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ ఇది. ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ దుస్తులకు త‌గ్గ‌ట్టే అద్భుత‌మైన ఆభరణాలను ధ‌రించి.. స్ట్రెయిట్ లాంగ్ రాపన్ ‌జెల్ హెయిర్ స్టైల్ తో అద‌ర‌గొట్టింది. రాపన్జెల్ తరహా పొడవాటి గోధుమ జుట్టుతో మంత్రముగ్దులను చేసింది. రాపన్జెల్ స్టైల్ హాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న హెయిర్ స్టైల్. ఇప్పుడు ఊర్వ‌శి బాలీవుడ్ కి ఇంపోర్ట్ చేసింది.

ఇక ఊర్వ‌శి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అటు బాలీవుడ్ లో న‌టిస్తూనే ఇటు టాలీవుడ్ లోనూ రంగ ప్ర‌వేశం చేస్తోంది. టాలీవుడ్ లో ఓ యువ‌త‌రం స్టార్ స‌ర‌స‌నా ఓ మూవీ చేస్తోంది. బ్లాక్ రోజ్ అనే టైటిల్ తో తెలుగులో సినిమా తెర‌కెక్కుతోంది. ర‌ణ‌దీప్ హుడా స‌ర‌స‌న ఇన్ స్పెక్ట‌ర్ అవినాష్ లో న‌టిస్తూ బిజీగా ఉంది.