Begin typing your search above and press return to search.

ఎడారిలో ఆరబోసిన అందాలు ఆవిరికావట .. సాక్ష్యం ఇదే!

By:  Tupaki Desk   |   9 March 2021 6:30 AM GMT
ఎడారిలో ఆరబోసిన అందాలు ఆవిరికావట .. సాక్ష్యం ఇదే!
X
అందం ఎక్కడ ఉన్నా అందంగానే కనిపిస్తుంది. అడవుల్లో ఒలకబోసినా .. ఎడారిలో ఆరబోసినా అందం తన లక్షణాన్ని మాత్రం కోల్పోదు. అది దట్టమైన ఒంపుసొంపుల దాడితో మంచుకొండలను కరిగిస్తుంది .. ఏడారిలో వేడెక్కిన ఇసుక తెన్నెలను ఎంచక్కా చల్లబరుస్తూ ఉంటుంది. పున్నమి వెన్నెల్లో జాబిలి ఎంత నిండుగా కనిపిస్తుందో, కొండగాలి తెరలు తెరలుగా మనసుకి ఎంతటి పండుగ చేస్తుందో అందం కూడా అలాంటి ఆనందాన్నే ఇస్తుంది .. అలాంటి అనుభూతినే కలిగిస్తుంది. అందుకే ఆకలికి .. దాహానికి అందాన్ని మించిన విరుగుడు లేదని అంటారు.

అందం ఉండటం వేరు .. దోర దోర అందాలను ఆరారగా ఆవిష్కరించడం వేరు. ఆ విద్య తెలిసినవారే అప్సరసలు అనిపించుకుంటారు .. అతిలోక సుందరి అనిపించుకుంటారు. అలా బాలీవుడ్ జనాలతో అనునిత్యం పొగడ్తలను పోగుచేసుకునే అందాలరాశిగా 'ఊర్వశి రౌతేలా' కనిపిస్తుంది. మల్లెమొగ్గలు .. దానిమ్మ మొగ్గలు కలిపి చేసినట్టుగా కనిపించే ఈ అమ్మాయి, కుర్రాళ్లు గుండె గోడలపై మెరుస్తూ ఉంటుంది. వాళ్ల మనసులన్నీ మణిహారాలుగా ధరిస్తూ ఉంటుంది. వాళ్ల కలల రాజధానిలో కొలువు నిర్వహిస్తూ ఉంటుంది.

తాజాగా ఈ సుందరి ఎడారిలో ఎర్రకారు పక్కన నల్ల డ్రెస్ లో మెరిసిపోతున్న ఒక ఫొటోను ఆమె వదిలింది. ఎడారిలో విరిసిన కలువలా .. అందాల ఒయాసిస్సులా ఆమె కనిపిస్తోంది. అడవిలో విరిసే అందమైన పూల సొగసులు .. ఎడారిలో కురిసే వెన్నెధారలు ఒకప్పుడు వృథా అయ్యేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అందం ఎక్కడ ఉన్నా కళ్లాలు తెంపుకుని ఇలా కుర్ర మనసులను చేరుకుంటూనే ఉంది. వాళ్ల కొంటె చూపుల కొమ్మకు ఊహల ఊయల తగిలించుకుని ఊగుతూనే ఉంది. ఎడారి కూడా అందాన్ని ఆవిరిచేయలేదనే విషయాన్ని ఊర్వశి చెప్పకనే చెప్పేస్తోంది కదూ!