Begin typing your search above and press return to search.

సీనియర్‌ నటి రెండవ పెళ్లి.. కొడుకుల ఒత్తిడి

By:  Tupaki Desk   |   23 April 2021 7:41 AM GMT
సీనియర్‌ నటి రెండవ పెళ్లి.. కొడుకుల ఒత్తిడి
X
బాలీవుడ్‌ బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఊర్వశి ధోలకియా త్వరలో రెండవ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని తాజా ఇంటర్వ్యూ తో వెళ్లడయ్యింది. 41 ఏళ్ల ఊర్వశి ధోలకియా సుదీర్ఘ కాలంగా బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూ వచ్చింది. బాల నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె 16 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన కొన్నాళ్లకే కవల కొడుకులకు జన్మనిచ్చింది. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న ఊర్వశి ధోలకియా ఇద్దరు కొడుకులను సొంతంగా కష్టపడి పెంచింది. వారిద్దరు ఇప్పుడు వారి జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఈ సమయంలో వారిద్దరు తల్లి ఊర్వశి ధోలకియా పెళ్లి చేయాలని ఆశ పడుతున్నారట.

తమ కోసం జీవితంలో ఎన్నో మిస్ అయిన తల్లిని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారట. ఇటీవల ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటూ నన్ను పదే పదే కోరుతున్నారు. ప్రస్తుతానికి నాకు అలాంటి ఆలోచన అయితే లేదు. కాని భవిష్యత్తులో ఎవరైనా నాకు నచ్చిన వ్యక్తి తారస పడితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటూ చెప్పుకొచ్చింది. నేను ఒక ఇండిపెండెండ్‌ ఉమెన్‌ గా జీవితాన్ని ఇన్నాళ్లు కొనసాగిస్తూ వచ్చాను. ముందు ముందు కూడా నేను నా జీవితంలో స్వతంత్ర్యంగానే ఉండాలనుకుంటున్నాను. నా ఫీలింగ్స్ ను గౌరవించి నన్ను అభిమానించే వ్యక్తి తారస పడిన సమయంలో పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ ఊర్వశి ధోలకియా చెప్పుకొచ్చారు.

ఊర్వశి ధోలకియా హిందీ బిగ్ బాస్ సీజన్‌ 6 విజేతగా నిలిచారు. అంతకు ముందు ఆ తర్వాత కూడా ఆమె బుల్లి తెర కెరీర్‌ సూపర్‌ హిట్స్ తో దూసుకు పోతూనే ఉంది. బాలీవుడ్‌ నుండి కూడా ఎన్నో ఆఫర్లను దక్కించుకున్నా ఆమె తన ప్రథమ ప్రాధన్యత బుల్లి తెరకే అంటూ చెప్పేవారు. ఉత్తరాది ప్రేక్షకుల చెరగని ముద్ర వేసిన ఊర్వశి ధోలకియా అద్బుతమైన నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తల్లిగా కూడా ఆమె ఇద్దరు పిల్లలను పెంచిన తీరును ప్రతి ఒక్కరు అభినందిస్తారు. ఇప్పుడు ఆమె ఇద్దరు కొడుకులు తల్లి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాలను స్వయంగా ఊర్వశి ధోలకియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.