Begin typing your search above and press return to search.

రంగీళా బ్యూటి రీఎంట్రీ అదిరిందిగా

By:  Tupaki Desk   |   22 March 2018 4:33 AM GMT
రంగీళా బ్యూటి రీఎంట్రీ అదిరిందిగా
X
ముంబై భామ ఊర్మిళా మండోద్కర్ కు దేశమంతటా అభిమానులు ఉంటారు. తెలుగు ఆడియన్స్ మనసులకు కూడా పెద్ద గాయం చేసేసిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో చాలాకాలమే చక్రం తిప్పింది. 2008 వరకూ సినిమాలు చేసిన ఈమె.. 2014లో మొహసిన్ అక్తర్ మీర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. మళ్లీ దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆన్ స్క్రీన్ పైకి వచ్చేస్తోంది రంగీలా బ్యూటీ.

బ్లాక్ మెయిల్ మూవీలో 'బేవఫా బ్యూటీ' అనే ఐటెం సాంగ్ చేయబోతోంది ఊర్మిళ. త్వరలో ఈ పాటకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయనున్నారు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన బ్లాక్ మెయిల్ మూవీకి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కడా ఊర్మిళను చూపించలేదు కానీ.. ఆమె ఏ సన్నివేశంలో కనిపిస్తోందో.. అది మాత్రం బ్లాక్ మెయిల్ ట్రైలర్ లో ఉంది. ఇర్ఫాన్ ఖాన్ తన స్నేహితుడితో కలిసి బార్ లో మందు తాగుతూ మాట్లాడుతూ ఉన్న సమయంలో.. ఈ ఐటెం సాంగ్ వస్తుందట.

ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్లీ తన మునుపటి అందాన్ని కొనసాగిస్తూ.. మెరుపులను ఇనుమడింపచేసుకుదంట ఊర్మిళా మండోద్కర్. ఇక బ్లాక్ మెయిల్ మూవీ విషయానికి వస్తే.. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమసంబంధం ఉందని పసిగట్టిన ఓ భర్త.. వారిద్దరినీ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు. బాగానే ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే.. ఈ విషయం పసిగట్టిన చాలామంది ఇతడే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే సంగతి బయటకు చెప్పకుండా ఉండేందుకు.. తమకు అంత కావాలని ఇంత ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. కథను సీరియస్ గా కాకుండా విపరీతమైన ఫన్ జోనర్ లో రూపొందించాడు దర్శకుడు అభినయ్ డియో.