Begin typing your search above and press return to search.

లేట్ ఏజ్ లో యాయిరే యాయిరే

By:  Tupaki Desk   |   7 March 2018 10:14 AM GMT
లేట్ ఏజ్ లో యాయిరే యాయిరే
X
అది 1995 సెప్టెంబర్ నెల. రామ్ గోపాల్ వర్మ రంగీలా విడుదలైంది. అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్ హీరోలుగా ఊర్మిళా మదొంకర్ అనే అప్ కమింగ్ హీరొయిన్ తో తొలుత పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుని ఆ తర్వాత నాలుగైదు వారాల పాటు ఆ సినిమా టికెట్ దొరికినోడు మగాడు అనే రేంజ్ లో పుంజుకుంది. దానికి వర్మ టేకింగ్ తో పాటు రెహమాన్ మతి పోగొట్టే సంగీతం ఒక కారణం కాగా అన్నింటి కన్నా ఎక్కువైన కారణం మరొకటి ఉంది. తనే ఊర్మిళా. యువతను కొన్నాళ్ళ పాటు నిద్రకు దూరం చేసింది మాత్రం తనహా తనహా పాటలో పొట్టి పొట్టి బట్టలు వేసుకుని బీచ్ ఒడ్డులో రెచ్చిపోయిన ఊర్మిళా అందాలే. తన ప్రభావం ఏ స్థాయికి వెళ్లిపోయింది అంటే శంకర్ అంతటి దర్శకుడు పిలిచి మరీ భారతీయుడు సినిమాలో ఛాన్స్ ఇచ్చేంత. చాలా కాలం ఊర్మిళా సౌత్ సినిమాలో బలమైన పాగా వేసింది.

కాని రంగీలా కంటే ముందు తను గాయం సినిమాలో హీరొయిన్ గా నటించిన సంగతి చాలా మందికి గుర్తు లేదు. పేరు వచ్చింది మాత్రం రంగీలాతోనే. కొత్త హీరొయిన్ల తాకిడి మొదలయ్యాక మాజీల జాబితాలోకి చేరిన ఊర్మిళా చాలా లేట్ ఏజ్ లో రెండేళ్ళ క్రితం ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది . మీడియాకు దూరంగా ఉంటున్న ఊర్మిళా తన సోషల్ మీడియా ఎకౌంటు లో కొత్త ఫోటో ఒకటి షేర్ చేసింది. 50 వయసుకి దగ్గరగా ఉన్నా ఇంకా చెక్కుచెదరకుండా గ్లామర్ ని మైంటైన్ చేస్తున్న తనను చూస్తే షాక్ కొట్టక మానదు. అందుకేనా అప్పటి యూత్ అలా వెర్రెక్కిపోయారు అనిపిస్తుంది. కెరీర్ మొత్తం వర్మ దర్శకత్వంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఊర్మిళా భర్త పేరు మోసిన్ అక్తర్. కాశ్మీర్ కు చెందిన ఈ బిజినెస్ మెన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఊర్మిళా. శారీరకంగా ఫిట్ గా ఉంది కాబట్టి పనిలో పని రీ ఎంట్రీ ఇచ్చేస్తే ఓ పనైపోద్దిగా.