Begin typing your search above and press return to search.

ఉరి... బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కు గుణపాఠం

By:  Tupaki Desk   |   31 Jan 2019 11:53 AM GMT
ఉరి... బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కు గుణపాఠం
X
వందల కోట్ల బడ్జెట్‌ తో నిర్మితం అవుతున్న సినిమాలను ప్రేక్షకులు తిరష్కరిస్తారు. అదే సమయంలో చిన్న బడ్జెట్‌ సినిమాలకు కూడా భారీ సక్సెస్‌ ను కట్టబెడతారు. ఈమద్య కాలంలో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్దకు వచ్చిన 'థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌' చిత్రం దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో రూపొందింది. కాని ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ప్రేక్షకులు బడ్జెట్‌ ను చూసి, సినిమాలోని కాస్టింగ్‌ ను చూసి సక్సెస్‌ చేయరని ఆ ఫలితాన్ని బట్టి మరో సారి నిరూపితం అయ్యింది. తాజాగా 'ఉరి : ది సర్జికల్‌ స్ట్రైక్‌' మూవీ కూడా బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కు ఒక గుణపాఠంగా నిలిచింది.

45 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రం 20 రోజుల్లో 250 కోట్ల వసూళ్లను రాబట్టింది. పరిస్థితి చూస్తుంటే మరో రెండు వందల కోట్లు కూడా వసూళ్లు చేసేలా ఉంది. అతి కొద్ది థియేటర్లలో మాత్రమే ఈ చిత్రం విడుదలైంది. రెండవ రోజు నుండే థియేటర్ల సంఖ్య పెరగడం మొదలైంది. విడుదలైనప్పటికి ఇప్పటికి థియేటర్ల సంఖ్య మూడు రెట్లుగా పెరిగింది. మరో రెండు వారాల పాటు ఈ జోరు కొనసాగడం ఖాయం అంటూ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు.

ఇప్పటి వరకు బాలీవుడ్‌ లో సహ నటుడిగా నటిస్తూ వస్తున్న కౌశల్‌ హీరోగా, సక్సెస్‌ ఎరుగని యామి గౌతమ్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రం విడుదల కాకముందు ఎవరికి తెలియదు. దేశం గర్వించదగ్గ సర్జికల్‌ స్ట్రైక్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. కాన్సెప్ట్‌ బాగుండటంతో పాటు, మంచి భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించడంతో కాసుల వర్షం కురుస్తోంది. అందుకే కాన్సెప్ట్‌ బాగుండాలని, హీరో కోసం, హీరోయిన్‌ కోసం కథలు ఎంపిక చేసుకోవద్దనేది ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ గుణపాఠం నేర్చుకోవాలి. ఉరి వంటి సినిమాలు ముందు ముందు మరిన్ని రావాలని ప్రేక్షకులు ఈ కలెక్షన్స్‌ ద్వారా చెప్పకనే చెబుతున్నారు.