Begin typing your search above and press return to search.

ఫోటోషూట్ కి వెళితే హిజ్రాలు వెంబ‌డించారు!

By:  Tupaki Desk   |   1 Jun 2022 3:55 PM GMT
ఫోటోషూట్ కి వెళితే హిజ్రాలు వెంబ‌డించారు!
X
ఇటీవ‌లి కాలంలో హాట్ బ్యూటీ ఉర్పీ జావేద్ విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. ఈ అమ్మ‌డు ఆరుబ‌య‌ట‌కు వ‌స్తోంది అంటే కెమెరా క‌ళ్లు అదే ప‌నిగా కాపు కాసుకుని కూచుంటున్నాయి. ఉర్ఫీ జిమ్ కి వెళ్లినా లేదా షాప్ ఇ వెళ్లినా లేదా మార్కెట్లో ప్ర‌త్య‌క్ష‌మైనా ప్ర‌తిచోటా ముంబై మీడియా వెంబ‌డిస్తోంది. త‌న ఫోటోషూట్ల కోసం వెంప‌ర్లాడుతోంది. అంతగా మీడియా అటెన్ష‌న్ ని గ్రాబ్ చేయ‌డంలో ఉర్ఫీ పెద్ద స‌క్సెసైంది. బిగ్ బాస్ బ్యూటీగా పాపుల‌రైన ఉర్పీకి ఇప్పుడు సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. దాంతో పాటే ఈ బ్యూటీ నాలుగు చేతులా ఆర్జిస్తూ ల‌గ్జ‌రీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.

తాజాగా ఓ ఈవెంట్ కోసం వెళ్లిన ఉర్ఫీ జాదవ్ ని కొంద‌రు హిజ్రాలు వెంబ‌డించిన వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. నిజానికి సెల‌బ్రిటీలు ఎక్క‌డ ఉన్నా చేయి చాచ‌డం హిజ్రాల అల‌వాటు. అదే విధంగా ఉర్ఫీని వెంబ‌డించ‌డం ఈ వీడియోలో క‌నిపిస్తోంది. అయితే అక్క‌డి నుంచి వారికి టాటా చెప్పి ఈ అమ్మ‌డు స్టైల్ గా భ‌వంతి లాన్ లోకి వెళ్లిపోయింది.

అయితే ఉర్ఫీ జావేద్‌ కి కొంచెమైనా క‌నిక‌రం లేదా! అంటూ హిజ్రాలు విసుక్కున్నార‌ట‌. అదంతా స‌రే కానీ ఈ బ్యూటీ ఇలా వీధుల్లో వీరంగం వేయ‌డ‌మేనా లేక సినిమాల్లో న‌టించే ప్ర‌ణాళిక‌లు ఏవైనా ఉన్నాయా? అంటూ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. దానికి ఉర్ఫీ త్వ‌ర‌లోనే ప్రాక్టికల్ గా ఆన్స‌ర్ ఇవ్వ‌బోతోంద‌ట‌.

ఉర్ఫీ జావేద్ బిగ్ బాస్ OTT షోలో పాల్గొన్న తర్వాత చాలా మంది హృదయాలను గెలుచుకుంది. షో నుండి తొలగించబడిన 1వ BB ఓటీటీ పోటీదారు ఆమె. ఎలిమినేషన్ అయినప్పటి నుండి ఉర్ఫీ చాలా వివాదాలలో చిక్కుకుంది. ప్రధానంగా త‌న విస్తుగొలిపే ప్రత్యేకమైన ఫ్యాషన్ ఎంపికల కారణంగా వివాదాల్లో న‌లుగుతోంది. తాను ధ‌రించే బట్టలు ప్రజలకు చర్చనీయాంశంగా మారాయి. అంతే కాదు ఉర్ఫీ జావేద్ ఇంటిపేరు కారణంగా జావేద్ అక్తర్ మేనకోడలు అని కూడా పుకార్లు వచ్చాయి.

ఈ హాట్ బ్యూటీ `బడే భయ్యా కి దుల్హనియా`లో అవ్నీ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మేరీ దుర్గాలో ఆర్తిగా,.. బేపన్నాలో బెల్లాగా .. ALT బాలాజీలో `పంచ్ బీట్ సీజన్ 2`లో మీరాగా కనిపించింది. 2020లో ఉర్ఫీ జావేద్ శివాని భాటియాగా `యే రిష్తా క్యా కెహ్లతా హై`లో చేరారు. కసౌతి జిందగీ కేలో తనీషా చక్రవర్తి పాత్రను కూడా పోషించారు. టీవీలో ఆమె పోషించిన అనేక ఇతర పాత్రలు మెప్పించాయి. ప్ర‌స్తుతం పెద్ద తెర‌పై పెద్ద కెరీర్ ని ఉర్ఫీ ఆశిస్తోంది. సౌత్ వైపు కూడా దృష్టి సారించ‌నుంద‌ని స‌మాచారం.