Begin typing your search above and press return to search.

మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ..

By:  Tupaki Desk   |   18 March 2020 3:30 AM GMT
మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ..
X
త్వరలో ఉప్పెన మూవీ తో తెలుగుతెరకు పరిచయం కాబోతున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. ఈ మూవీతో మెగా ఫ్యామిలీ వారసుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల విడుదలైన 'నీ కన్ను నీలి సముద్రం' పాటతో కుర్రకారు మనసులను దోచుకున్న కృతి, తన మొదటి సినిమా విడుదల కాకముందే తన అందమైన హావభావాలతో డైరెక్టర్ల మనసులను కూడా దోచుకున్నట్లుంది. అందుకే ఉప్పెన విడుదలకు ముందే మరో క్రేజీ మూవీలో హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకుంది.

డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త చిత్రం "18 పేజీలు". ఈ సినిమాలో యంగ్ హీరో నిఖిల్ నటిస్తుండగా, సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ దర్శకత్వం వహించనున్నాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టిని ఎంపిక చేసారు. ఉప్పెనలో కృతి అందం చూసి సుకుమార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడని, అందుకే కృతిని డైరెక్టర్ ప్రతాప్ కు రిఫర్ చేసాడని సమాచారం. ప్రస్తుతం సుకుమార్ మైత్రి మూవీస్ బ్యానర్ లో అల్లు అర్జున్ 20వ సినిమా గురించి ఆలోచిస్తుండగా కృతిశెట్టి దృష్టికి వచ్చిందని అందరు అనుకుంటున్నారు.

అర్జున్ సురవరం సినిమా విజయానందం లో ఉన్న నిఖిల్ ఈ సినిమాపై ఎంతో ఎక్సైట్ గా ఉన్నాడట. అంతేగాక సస్పెన్స్ థ్రిల్లర్ కార్తికేయ-2 సినిమాపై కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడట. ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి తో నిఖిల్ రొమాన్స్ వర్కవుట్ అయితే ఈ కన్నడ భామకు టాలీవుడ్ లో సుస్థిర స్థానం దక్కతుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ '18 పేజీలు' సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు.