Begin typing your search above and press return to search.

'ఉప్పెన' మేకర్స్ థియేటర్స్ లోనే ఉప్పెన సృష్టిస్తారట...!

By:  Tupaki Desk   |   21 May 2020 5:38 PM GMT
ఉప్పెన మేకర్స్ థియేటర్స్ లోనే ఉప్పెన సృష్టిస్తారట...!
X
స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ఒకవైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూనే ప్రొడక్షన్ కూడా చూసుకుంటున్న విషయం తెలిసిందే. 'సుకుమార్ రైటింగ్స్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపించి 'కుమారి 21F' 'దర్శకుడు' చిత్రాలను నిర్మించాడు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ వారితో కలిసి 'ఉప్పెన' చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ తో పాటు రెండు లిరికల్ పాటలు వచ్చిన విషయం తెలిసిందే. అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు అనుకున్నారు. దానికి తగ్గట్లే షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంది. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడింది.

కానీ పరిస్థితులు ఇప్పుడప్పుడే అనుకూలించేలా కనపడకపోవడంతో 'ఉప్పెన' సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య అన్ని ఇండస్ట్రీల నిర్మాతలు థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశం లేదని భావించి తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే వివిధ భాషల్లోని 8 సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి సిద్ధమయ్యాయి. తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా మే 29న ఓటీటీలో రాబోతోంది. 'మహానటి' కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘పెంగ్విన్’ చిత్రాన్ని కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో జూన్ 19న‌ విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అమితాబ్ - ఆయుష్మాన్ ఖురానా 'గులాబో సితాబో'.. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శ‌కుంతల దేవి'.. అలాగే కన్నడ 'లా' మరియు 'ఫ్రెంచ్ బిర్యానీ'.. మలయాళ 'సూపియుమ్ సుజాతయుమ్' వంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవబోతున్నాయి.

ఈ నేపథ్యంలో 'ఉప్పెన' సినిమా కోసం ఓటీటీలు పోటీ పడ్డాయట. అయితే ఓటీటీలు ఈ సినిమాకి ఆఫర్ చేసిన ప్రైజ్ కి చిత్ర నిర్మాతలు సుముఖంగా లేరంట. దీనికి కారణం ఓటీటీలు మిగతా చిన్న సినిమాకి ఆఫర్ చేసే అమౌంట్ నే ఈ సినిమాకి ఆఫర్ చేశారట. ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్స్ దాదాపుగా 18 కోట్లు ఖర్చు చేసారని సమాచారం. వాస్తవానికి ఒక డెబ్యూ హీరో సినిమాకి అంత బడ్జెట్ పెట్టడం అరుదుగా జరుగుతుంది. మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. సుకుమార్ నేమ్ వాడుకొని ఈ సినిమా అంత కలెక్షన్స్ వెనక్కి తీసుకొస్తదని అందరూ అనుకున్నారు. కాకపోతే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఉన్న క్రైసిస్ వల్ల ఇది సాధ్యపడేలా లేదు. కానీ ఓటీటీ ఆఫర్ చేసే తక్కువ అమౌంట్ కి సినిమా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. దీంతో ఎంత లేట్ అయినా ఈ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని 'ఉప్పెన' మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఇదే కనుక నిజమైతే థియేటర్స్ లో వచ్చే ఫస్ట్ సినిమా ఇదే అయ్యే అవకాశం ఉంది.