Begin typing your search above and press return to search.

ఉప్పెనః కథ విన్నప్పుడే రూ.100 కోట్ల సినిమా అనుకున్న

By:  Tupaki Desk   |   7 Feb 2021 3:47 AM GMT
ఉప్పెనః కథ విన్నప్పుడే రూ.100 కోట్ల సినిమా అనుకున్న
X
వైష్ణవ్‌ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌ గా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖులు మాట్లాడుతూ ఉప్పెన సినిమా గురించి విన్నాం చూశాం అద్బుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా దర్శకుడు బుచ్చి బాబుకు గురువు మరియు ఈ సినిమా నిర్మాతల్లో ఒక్కరు అయిన సుకుమార్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా కథ గురించి సుకుమార్‌ చాలా గొప్పగా వ్యాఖ్యలు చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు.

నా వద్ద ఎంతో మంది చేసి దర్శకులు అయ్యారు. వారిని నేను శిష్యులు అనుకోను కాని బుచ్చి బాబును శిష్యుడు అనుకుంటాను. ఎందుకంటే నేను వాడికి లెక్కలు చెప్పాను. అక్కడి నుండి మా ప్రాయాణం మొదలు అయ్యింది. నా వద్ద ఉన్నప్పుడు వాళ్ల అమ్మగారు వాడి తోటి వాళ్లు అంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటూ కార్లలో తిరుగుతున్నారు అంటూ ఆందోళన చెందుతూ ఉండేవారు. ఆమెకు నేను ధైర్యం చెప్పేవాడిని. కాని నాకు కూడా బుచ్చి పై నమ్మకం ఉండేది కాదు. కాని ఎప్పుడైతే ఉప్పెన సినిమా కథ చెప్పాడో అప్పుడే నాకు ఇదో వంద కోట్ల సినిమా అవుతుందని అనిపించింది బుచ్చి బాబు ఒక పెద్ద డైరెక్టర్‌ అవుతాడని నమ్మకం కలిగింది.

బుచ్చి బాబు కథను చెప్పిన తీరు నచ్చడంతో రవి నవీన్‌ లు గారికి చెప్పడం వారు చేసేందుకు ముందుకు రావడం జరిగింది. వారితో కూడా నేను ఈ సినిమా వంద కోట్ల సినిమాగా చెప్పాను. ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేసి.. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి మరియు వేడుకకు వచ్చిన చిరంజీవి ఇతర దర్శకులకు కృతజ్ఞతలు చెప్పారు.