Begin typing your search above and press return to search.

#టాలీవుడ్.. విదేశీ మార్కెట్ కి ఉప్పెన ఊపు!

By:  Tupaki Desk   |   22 Feb 2021 6:30 AM GMT
#టాలీవుడ్.. విదేశీ మార్కెట్ కి ఉప్పెన ఊపు!
X
విదేశీ మార్కెట్ కి ఉప్పెన ఊపు తెచ్చిందా? అంటే అవున‌నే అనాలి. అలాగే సంక్రాంతి బ‌రిలో టాలీవుడ్ సినిమాలు విదేశాల్లోనూ రిలీజవ్వ‌డంతో కొత్త ఉత్సాహం మొద‌లైంది. ఇక తెలుగు సినిమాకి మ‌రో నైజాం లాంటి అమెరికా మార్కెట్లో నెమ్మ‌దిగా బెట‌ర్ రిజ‌ల్ట్ క‌నిపిస్తోంద‌న్న విశ్లేష‌ణ ట్రేడ్ లో సాగుతోంది. ఇది ఆశావ‌హ ధృక్ప‌థాన్ని పెంచుతోంది.

కోవిడ్ మహమ్మారి కారణంగా విదేశీ మార్కెట్లో వ్యాపారం పూర్తిగా జీరో అయ్యింది. ఎట్ట‌కేల‌కు అన్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డి తెలుగు చిత్ర పరిశ్రమ పుంజుకుంటుంది. ఉప్పెన ఇచ్చిన హుషారుతో మ‌రిన్ని సినిమాలు రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి. అమెరికాలో ఉప్పెన‌ను గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ రిలీజ్ చేయ‌గా.. ఆస్ట్రేలియాలో ప్రైడ్ సినిమా విడుదల చేసింది. ఆ రెండుచోట్లా తెలుగు సినిమా బెట‌ర్ మెంట్ కి ఈ సంస్థ‌లు కృషి చేశాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. బాల‌కృష్ణ‌-బోయ‌పాటి కాంబినేష‌న్ మూవీ బీబీ3ని ప్రైడ్ సినిమా లాక్ చేసింద‌ని.. నాని ట‌క్ జ‌గ‌దీష్ ని ఇదే సంస్థ రిలీజ్ చేయ‌నుంద‌ని తెలిసింది. ఒప్పందాలు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌న్న టాక్ వినిపిస్తోంది. అలాగే నితిన్ చెక్ సినిమాని రిలీజ్ చేసిన అనంత‌రం `రంగ్ దే`ని చేజిక్కించుకునేందుకు ఈ సంస్థ ప్లాన్ లో ఉందిట‌. ఇత‌ర సినిమాల‌కు సంబంధించిన డీల్స్ సాగుతున్నాయి. కాంపిటీటివ్ పంపిణీదారు నుంచి క‌ద‌లిక క‌నిపిస్తోంద‌ట‌. మ‌హమ్మారి తరువాత తెలుగు సినిమా విదేశీ వ్యాపారం నెమ్మ‌దిగా సాధారణ స్థితికి చేరుకుంటోంద‌న‌డానికి ఇది ఓ సూచిక‌. ముఖ్యంగా అమెరికా మార్కెట్ కి డోఖా లేక‌పోతే పూర్తిగా కోలుకున్న‌ట్టే. మునుముందు ప‌లు క్రేజీ చిత్రాలు రిలీజ్ కి వ‌స్తున్నాయి కాబ‌ట్టి అప్ప‌టికి ప‌రిస్థితి అన్నిర‌కాలుగా దారికొస్తుంద‌నే ఆశిస్తున్నారు.