Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : 'ఉప్పెన' తంబీ లుక్‌ అదుర్స్‌

By:  Tupaki Desk   |   1 April 2020 5:00 AM GMT
ఫొటోటాక్‌ : ఉప్పెన తంబీ లుక్‌ అదుర్స్‌
X
మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ‘ఉప్పెన’. అన్ని సాఫీగా సాగి ఈ కరోనా మహమ్మారి రాకుండా ఉండి ఉంటే రేపు ఉప్పెన థియేటర్లను ముచేందుకు సిద్దం అయ్యేది. కాని కరోనా కారణంగా మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది. షూటింగ్స్‌ క్యాన్సిల్‌ అవ్వడంతో పాటు థియేటర్లు మూసేశారు.. కనీసం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా అయ్యే పరిస్థితి లేదు. మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఉప్పెన సినిమా నుండి ఈ సమయంలో విజయ్‌ సేతుపతి లుక్‌ ను విడుదల చేశారు.

సినిమాలో విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న విషయం ముందు నుండి తెలిసిన విషయమే. అయితే తాజాగా విడుదలైన పోస్టర్‌ తో విజయ్‌ సేతుపతి నెగటివ్‌ ఛాయలు ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని అనిపిస్తుంది. ఈ తమిళ స్టార్‌ ఉప్పెన లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తెల్ల లుంగీ కట్టుకుని చేతికి పాత తరం వాచ్‌ పెట్టుకుని చెక్క కుర్చీలో కూర్చుని గంభీరంగా భయంకరంగా కాకుండా సింపుల్‌ గా విలనిజం ఉట్టిపడేలా సిగరెట్‌ తాగుతూ విజయ్‌ సేతుపతి ఇచ్చిన ఈ ఫోజ్‌ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది.

సుకుమార్‌ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూట్యూబ్‌ లో మంచి వ్యూస్‌ ను దక్కించుకున్నాయి. ముఖ్యంగా నీ కన్ను నీలి సముద్రం పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్‌ నమోదు అవుతున్నాయి. హీరోతో పాటు హీరోయిన్‌ పై కూడా జనాల్లో ఆసక్తి నెలకొంది. సినిమా గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతున్న ఈ సమయంలో విజయ్‌ సేతుపతి మాసీ విలన్‌ లుక్‌ విడుదల చేయడంతో సినిమా గురించి మరింత చర్చ జరుగుతోంది. ఈ విపత్తు నుండి ఎప్పుడు బయట పడి సినిమా చూస్తామా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.