Begin typing your search above and press return to search.

క్యూట్ కృతీకి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన 'ఉప్పెన' టీమ్..!

By:  Tupaki Desk   |   21 Sept 2020 12:00 PM IST
క్యూట్ కృతీకి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన ఉప్పెన టీమ్..!
X
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'ఉప్పెన'. ఈ చిత్రం ద్వారా కృతీ శెట్టి హీరోయిన్‌ గా టాలీవుడ్‌ కు పరిచయం అవుతోంది. ఇప్పటికే విడుదలైన వీడియో సాంగ్స్ మరియు ప్రచార చిత్రాల్లో కృతీ శెట్టి క్యూట్ లుక్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. నేడు కృతీ శెట్టి బర్త్ డే సందర్భంగా 'ఉప్పెన' చిత్ర యూనిట్ తాజాగా మరో పోస్టర్ ని విడుదల చేస్తూ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేసింది. ఈ పోస్టర్ లో కృతీ చేతికి గాజులు తొడుక్కుంటూ అందంగా కనిపిస్తోంది. ఈ సినిమా తర్వాత అమ్మడికి తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకునేలా కనిపిస్తోంది.

కాగా, 'ఉప్పెన' చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'ఉప్పెన' సినిమాకి మేకర్స్ భారీగానే ఖర్చు చేశారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని ఏ వేదికపై రిలీజ్ చేస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.