Begin typing your search above and press return to search.

ముక్కోణ‌పు పోటీలో `ఉప్పెన‌`ను కొట్టేది ఏది?

By:  Tupaki Desk   |   26 Jan 2021 4:30 AM GMT
ముక్కోణ‌పు పోటీలో `ఉప్పెన‌`ను కొట్టేది ఏది?
X
ఇన్నాళ్లు క్రైసిస్ వ‌ల్ల చాలా సినిమాలు థియేట్రిక‌ల్ రిలీజ్ ల కోసం వేచి చూశాయి. సంక్రాంతి బ‌రిలో నాలుగు సినిమాలు ఒకేసారి రిలీజ‌య్యాయి. ఇవ‌న్నీ సత్ఫ‌లితాన్ని ఇవ్వడం.. జ‌నం థియేట‌ర్ల వైపు క‌దిలి వ‌స్తున్నామ‌న్న భరోసాని ఇవ్వ‌డంతో ఇకపై అంద‌రిలోనూ క‌ద‌లిక వ‌చ్చింది. ప‌ర్య‌వ‌సానంగా వారం వారం రిలీజ్ ల వెల్లువ ఉంటుంద‌ని స‌న్నివేశం అర్థ‌మైంది. ప్ర‌తి శుక్ర‌వారం రెండు మూడు సినిమాలు ఖాయంగా బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌నున్నాయి.

ప్ర‌స్తుతం ఉప్పెన రిలీజ్ కి కూడా ముక్కోణ‌పు పోటీ త‌ప్ప‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ న‌టించిన ఉప్పెన‌ గత ఏడాది ఏప్రిల్ 2 న తెరపైకి రావాల్సి ఉండ‌గా.. కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా ప‌డింది. తాజాగా మ‌రో కొత్త‌ విడుదల తేదీని ప్రకటించాలని చిత్ర‌బృందం భావిస్తోంది. ఫిబ్రవరి 12 న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ ని ప్లాన్ చేశార‌న్న లీక్ అందింది.

అదేరోజు.. ఆది సాయికుమార్ శ‌శి.. జగపతి బాబు FCUK .. సందీప్ కిషన్ .. A1 ఎక్స్ ప్రెస్ విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిసింది. వీటిలో ఒక‌టి అటూ ఇటూ అయినా.. ఏ రెండు సినిమాలైనా ఒకే తేదీకి వ‌స్తాయ‌ని అంచ‌నా. ఉప్పెనా ఈ జాబితాలో చేరితే ముక్కోణ‌పు పోటీ షురూ అయిన‌ట్టే. అయితే ఈ పోటీలో ఉప్పెన‌ను కొట్టేది ఏది? అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్.

టీజర్ స‌హా పాట‌ల‌తో ఉప్పెన‌పై అంచ‌నాలు పెరిగాయి. ఆ వేవ్ బాక్సాఫీస్ వ‌ద్ద క‌నిపిస్తుంద‌నే భావిస్తున్నారు. కృతి శెట్టి అంద‌చందాలు యూత్ ని థియేట‌ర్ల‌కు లాక్కొస్తాయ‌న్న‌దే అంద‌రి ఉద్ధేశం. ఇందులో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ను పోషించారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.