Begin typing your search above and press return to search.

మెగా హీరో డెబ్యూ మూవీ రిలీజ్ అప్పుడేనా..?

By:  Tupaki Desk   |   11 Dec 2020 11:30 AM GMT
మెగా హీరో డెబ్యూ మూవీ రిలీజ్ అప్పుడేనా..?
X
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ''ఉప్పెన''. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాని దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా.. యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే 'ఉప్పెన' ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని టాక్ నడుస్తోంది.

ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ చేస్తుండటంతో 'ఉప్పెన' చిత్రాన్ని సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. అయితే పండ‌గ సీజ‌న్ లో విడుద‌లకు మైత్రీ టీమ్ ఒప్పుకోకపోవడంతో ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో విడుద‌ల‌ చేసే అవ‌కాశం ఉందని అంటున్నారు. వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ అయినప్పటికీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా 'ఉప్పెన' చిత్రాన్ని నిర్మించారని తెలుస్తోంది. దాదాపుగా 28 కోట్లు ఖ‌ర్చు అయిందని టాక్. అనేకసార్లు రీషూట్స్ చేయ‌డం వ‌ల‌నే బడ్జెట్ పెరిగి ఉంటుందని అంటున్నారు. డెబ్యూ హీరో సినిమా అంత వసూళ్ళు రాబడుతుందో లేదో చూడాలి. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.