Begin typing your search above and press return to search.

రిలీజ్ ముందే రికార్డు సృష్టిస్తున్న ఉప్పెన..

By:  Tupaki Desk   |   11 May 2020 6:30 PM IST
రిలీజ్ ముందే రికార్డు సృష్టిస్తున్న ఉప్పెన..
X
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతూ ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాడు. 'ఉప్పెన' పేరుతో రూపొందిన ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా మెగా ఫ్యామిలీ నుండి కొత్త హీరో వైష్ణవ్ తేజ్ పరిచయమవుతున్నాడు. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ కృతి శెట్టి తెలుగులో అరంగేట్రం చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంది. అదెలా అనుకుంటున్నారా.. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. లాక్ డౌన్ ముందు ఈ సినిమాలోని ఓ ప్రేమగీతాన్ని యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్రయూనిట్. 'నీ కన్ను నీలి సముద్రం..' అంటూ సాగే ఆ పాటను జావేద్ అలీ ఆలపించగా.. శ్రీమణి అద్భుతమైన లిరిక్స్ అందించారు.

ఇక ఈ మధ్య యూట్యూబ్ లో తెలుగు పాటలు భారీ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ఇటీవలే 'అల వైకుంఠపురంలో' పాటలు సృష్టించిన సంచలనం మాములు విషయం కాదు. దేశ విదేశాలలో ఆ పాటలకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక ఆ ఆల్బమ్ సాంగ్స్ అన్నీ 100మిలియన్ల పైనే వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. ఇక అలాంటి అరుదైన రికార్డును ఉప్పెన సినిమాలోని 'నీ కన్ను నీలి సముద్రం' పాట 50మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఆల్బమ్ లోని ఫస్ట్ సాంగే ఈ ఫీట్ సాధించడం విశేషమే. ఇక ఈ సినిమా ఏప్రిల్ 2నే విడుదల కావాల్సి ఉండగా.. లాక్ డౌన్ కారణంగా నిలిపేశారు. విడుదల ఎప్పుడనేది లాక్ డౌన్ అయిపోతే తెలుస్తుంది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విషాదంతో ముగుస్తుందని సమాచారం. పాటలతో విశేషాంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా థియేటర్లో ఎలా ఆకట్టుకోనుందో అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.