Begin typing your search above and press return to search.

ఉప్పెన డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఆ స్టార్ 'హీరోతోనే'..నా??

By:  Tupaki Desk   |   17 Feb 2021 3:08 PM GMT
ఉప్పెన డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఆ స్టార్ హీరోతోనే..నా??
X
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన పరిచయం అయ్యాడు. మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో ఈ డైరెక్టర్ పై ఇప్పుడు నిర్మాతలకు కూడా నమ్మకం ఏర్పడింది. అయితే మొదటి సినిమా కోసం ఏడాది పాటు వెయిట్ చేసారు మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. మరి డైరెక్టర్ బుచ్చిబాబు తదుపరి సినిమా ఏంటి? అనే ప్రశ్నలు ఇండస్ట్రీలో తలెత్తుతున్నాయి. మరి వాటికీ సమాధానం బుచ్చిబాబు ఆల్రెడీ ఇచ్చేసాడని కొన్ని కథనాలు తెలుపుతుంటే.. సోషల్ మీడియాలో బుచ్చిబాబు ఉప్పెన సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పేసాడని మరికొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మరి బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది చర్చకు దారితీసింది.

ఇదిలా ఉండగా.. బుచ్చిబాబు పలు ఇంటర్వ్యూలలో ఓ స్టార్ హీరో గురించి పదేపదే ప్రస్తావించాడు. ఆ హీరో ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సమయంలో బుచ్చిబాబు ఎన్టీఆర్ కి ఓ స్టోరీ లైన్ వినిపించడం జరిగిందని చెప్పాడు. ఆ లైన్ కూడా ఎన్టీఆర్ కు బాగా నచ్చిందని చెప్పినట్లు తెలిపాడు. ఇంకా ఆ కథ తన దగ్గర రెడీగా ఉందని బుచ్చిబాబు కొన్ని సందేహాలకు తెరదింపాడు. అలాగే ఉప్పెన రిలీజ్ అయ్యాక నా నెక్స్ట్ సినిమా ఓ బడా హీరోతోనే ఉంటుందని చెప్పినట్లు వార్తలొచ్చాయి. మరి ఈ లెక్కన బుచ్చిబాబు నెక్స్ట్ హీరో ఎన్టీఆర్ మాత్రమే అయ్యుంటాడని అంచనాలు వేస్తున్నాయి సినీవర్గాలు. చర్చల దశలో ఉన్న ఆ కథ అనుకున్న హీరో దగ్గరికే వెళ్తుందా.. బుచ్చిబాబు చెప్పినట్లుగా స్టార్ హీరో ఓకే చేస్తాడా చూడాలి! ఇదిలా ఉండగా ప్రస్తుతం బుచ్చిబాబు ఉప్పెన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడట.