Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో సినిమాని కన్ఫర్మ్ చేసిన 'ఉప్పెన' డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   20 May 2021 10:47 AM GMT
ఎన్టీఆర్ తో సినిమాని కన్ఫర్మ్ చేసిన ఉప్పెన డైరెక్టర్..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే తారక్ కు ఓ కథ వినిపించారని.. లైన్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడిచింది. అయితే ఇంతవరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. రీసెంటుగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ బుచ్చిబాబు సినిమాని ప్రస్తావించలేదు. దీంతో వీరి కాంబోలో సినిమా ఉండకపోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా బుచ్చిబాబు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ తో ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు చెప్పకనే చెప్పాడు.

నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ''హ్యాపీ బర్త్ డే నందమూరి తారక రామారావు గారు. వెయిటింగ్ సార్. లోకల్ స్టోరీని ప్రపంచవ్యాప్తంగా చెప్పి ట్రెండ్ సృష్టిద్దాం'' అని బుచ్చిబాబు తన పోస్ట్ లో రాసుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఖచ్చితంగా ఉంటుందని అర్థం అవుతోంది. ఇప్పటి వరకు వినిపిస్తున్న టాక్ కి తగ్గట్లే ఇదొక రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే స్పోర్ట్స్ డ్రామా అనేది నిజమేనేమో అనిపిస్తోంది.

కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తో కలసి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చేస్తున్నారు. ఇది పూర్తైన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు తారక్. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. యువసుధ ఆర్ట్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదే క్రమంలో 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. దీని తర్వాత బుచ్చిబాబు సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.