Begin typing your search above and press return to search.

పుకార్లకు చెక్ పెట్టేసిన ఉప్పెన బ్యూటీ!

By:  Tupaki Desk   |   19 May 2021 5:30 AM GMT
పుకార్లకు చెక్ పెట్టేసిన ఉప్పెన బ్యూటీ!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ మూవీతో ఇంపాక్ట్ క్రియేట్ చేసే హీరోయిన్స్ చాలా అరుదు. కానీ ఒకే సినిమాతో టోటల్ ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి. ఈ యంగ్ హీరోయిన్ వచ్చిరాగానే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. నిజానికి మొదటి సినిమాలోనే స్టార్ హీరోయిన్ రేంజిలో పెర్ఫార్మన్స్ చేసిందంటే మరి ఇంకా ముందుముందు ఏ రేంజిలో ఆకట్టుకుంటుందో అంటున్నారు అభిమానులు. ఎందుకంటే ఈ రేంజిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసాక అమ్మడు ఏం చేసినా ఎలాంటి సినిమాలు చేసినా ప్రేక్షకులు థియేటర్లకు పరిగెత్తుకుంటూ వస్తారు.

ఉప్పెన సినిమాలో ముద్దుముద్దు మాటలతో.. అంతకన్నా ముచ్చటైన హావభావాలతో ఇట్టే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది కృతి. అలాగే రావడంతోనే మరో మూడు క్రేజీ సినిమాలను లైన్ లో పెట్టేసింది. అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఆమె క్యారెక్టర్స్ బేబమ్మ పాత్రకు పూర్తి విరుద్ధంగా ఉంటాయని తెలుస్తుంది. ఒకటి నానితో పీరియడిక్ శ్యామ్ సింగరాయ్ మూవీలో నటిస్తూనే.. హీరో సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాను ఓకే చేసింది. సింపుల్ టైటిల్స్ తో ఆకర్శించే డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఈసారి కూడా అలాంటి టైటిల్ పెట్టి సర్ప్రైజ్ చేసాడు.

అయితే ఈ సినిమాలో కృతి పక్కా హైదరాబాది అమ్మాయిగా కనిపించనుందని టాక్. దీనితో పాటు కృతి హీరో రామ్ సరసన ఓ సినిమా చేస్తోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీలో కృతిశెట్టి ఎంపికైంది. అయితే ప్రస్తుతం ఈ మూడు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలిపింది అమ్మడు. కానీ ఈ మధ్య ఇండస్ట్రీలో కృతి తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందని పుకార్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా కృతి ఆ పుకార్లకు చెక్ పెట్టేసింది. నిజంగానే ఆ వార్తలలో నిజం లేదని.. ఏదైనా ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టింది. అంతేగాక అందరూ మాస్కులు ధరించి ఆరోగ్యంగా ఉండాలని కృతి చెప్పుకొచ్చింది.