Begin typing your search above and press return to search.

సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్న విలన్

By:  Tupaki Desk   |   10 April 2016 5:08 AM GMT
సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్న విలన్
X
హిందీ మోడల్ కం బాలీవుడ్ యాక్టర్ ఉపేన్ పటేల్.. శంకర్ తీసిన ఐ మూవీతో సౌత్ లో కూడా అడుగుపెట్టాడు. అయితే ఈ మూవీ రిజల్ట్ కారణంగా.. ఆ తర్వాత మాత్రం ఆఫర్స్ రాలేదు. తమిళ్ లో బిజీ అవుతాడని అనుకున్నా.. తెలుగులో తప్ప కోలీవుడ్ నుంచి ఆఫర్స్ మాత్రం అందలేదు.

ఆది హీరోగా నటిస్తున్న చుట్టాలబ్బాయి కోసం గతేడాది ఉపేన్ పటేల్ ని సంప్రదించింది యూనిట్. అప్పట్లో డేట్స్ కుదరక ఇతగాడు సైన్ చేయలేదు. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేట్ అవడంతో.. రీసెంట్ గా మరోసారి ఉపేన్ దగ్గరకు వెళ్లారు చుట్టాలబ్బాయి నిర్మాతలు. ఇప్పుడీ సినిమాకి సైన్ చేసిన ఉపేన్ పటేల్... ఈ నెలాఖరు నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేస్తున్నట్లు చెప్పాడు.

తన టాలీవుడ్ ఎంట్రీ ఎలాంటి సినిమాతో ఉండాలని భావించాడో.. చుట్టాలబ్బాయి అలాగే ఉంటుందని చెబుతున్నాడు ఉపేన్. తనకు భాష పెద్దగా ఇబ్బంది కాదని, ఆ మాట కొస్తే మొదట్లో తనకు హిందీ కూడా సరిగా రాకపోయినా.. బాలీవుడ్ సినిమాలు చేశానంటున్నాడు. అలాగే ఇప్పుడు తెలుగు సినిమా కోసం ప్రత్యేకంగా ట్యూటర్ ని పెట్టించుకుని మరీ, స్క్రిప్ట్ పై పట్టు పెంచుకుంటున్నానని చెబుతున్నాడు ఉపేన్ పటేల్.