Begin typing your search above and press return to search.

అయ్యో బ్రహ్మాస్త్ర... జక్కన్న కూడా కాపాడలేక పోతున్నాడా!

By:  Tupaki Desk   |   18 Aug 2022 10:30 AM GMT
అయ్యో బ్రహ్మాస్త్ర... జక్కన్న కూడా కాపాడలేక పోతున్నాడా!
X
బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ క్రేజీ మూవీ బ్రహ్మాస్త్ర విడుదల తేదీ దగ్గర పడింది. సెప్టెంబర్ 9వ తారీకున ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్పీడ్‌ అయ్యాయి. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి సమర్పిస్తున్న విషయం తెల్సిందే.

రణబీర్ కపూర్‌ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను తెలుగు లో రాజమౌళి సమర్పిస్తున్న కారణంగా కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ ఉంటాయని అనిపిస్తుంది. సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను చేరువ అవుతుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కాని ఇప్పటి వరకు తెలుగు లో బ్రహ్మాస్త్ర కి మినిమంగా కూడా బజ్ క్రియేట్‌ అవ్వలేదు.

బాలీవుడ్ స్టార్‌ కాస్ట్‌ తో పాటు నాగార్జున కీలక పాత్రలో నటించడం ఇంకా రాజమౌళి సినిమా ను సమర్పించడం వంటి కారణాలు ఎన్ని ఉన్నా కూడా సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్‌ అవ్వడం లేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాస్త్ర కు సోలో రిలీజ్ దక్కడం లేదు. బ్రహ్మాస్త్ర కు పోటీగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు పోటీగా రాబోతున్నాయి.

కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాను సెప్టెంబర్‌ 9వ తారీకున విడుదల చేయబోతున్నారు. బ్రహ్మాస్త్ర తో డైరెక్ట్‌ ఢీ కిరణ్ అబ్బవరం రెడీ అయ్యాడు. ఆ సినిమా మాత్రమే కాకుండా గుర్తుందా శీతాకాలం సినిమా తో సత్యదేవ్ మరియు తమన్నాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఆ రెండు సినిమాలు కాదు అన్నట్లుగా శర్వానంద్ కీలక పాత్రలో నటించిన 'ఒకే ఒక జీవితం' సినిమాను కూడా అదే తేదీన విడుదల చేయబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమా తెలుగు లో పాజిటివ్ బజ్ క్రియేట్‌ చేయడం లో విఫలం అయ్యింది.

అందుకే చిన్న సినిమాలు ఆ సినిమా విడుదల అవ్వబోతున్న రోజునే విడుదలకు సిద్ధం అయ్యాయి. ఆ చిన్న సినిమాల ముందు బ్రహ్మాస్త్ర నిలుస్తుందా.. లేదంటే బ్రహ్మాస్త్ర ముందు అవి కనిపించకుండా పోతాయా అనేది కాలమే నిర్ణయించాలి.