Begin typing your search above and press return to search.

యానిమ‌ల్ కి గుడ్ బాయ్ చెబుతోందా?

By:  Tupaki Desk   |   6 Aug 2022 4:02 AM GMT
యానిమ‌ల్ కి గుడ్ బాయ్ చెబుతోందా?
X
పోటీ ప్ర‌పంచంలో స‌క్సెస్ ఫుల్ కెరీర్ ని ఎలా ర‌న్ చేయాలో ర‌ష్మిక మంద‌న‌ను చూసి నేర్చుకోవాల్సిందే. క‌న్న‌డ‌లో తొలి చిత్రం కిరిక్ పార్టీతో స‌క్సెస్ అందుకుని ఆ త‌ర్వాత అనూహ్యంగా `ఛ‌లో` చిత్రంతో టాలీవుడ్ లో ప్ర‌వేశించిన ర‌ష్మిక ఇక్కడా బంప‌ర్ హిట్ కొట్టింది. అటుపై వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న క్రేజీ చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంది.

ఓవైపు తెలుగులో న‌టిస్తూనే త‌మిళం- హిందీ రంగంలోకి దూసుకెళ్లేందుకు ప్లాన్ చేసింది. దీపం ఉండ‌గానే తెలివిగా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్ని చుట్టేస్తోంది ఇప్పుడు.

ముఖ్యంగా ఈ బ్యూటీ బాలీవుడ్ కెరీర్ పై దృష్టి సారించింది. నేష‌న‌ల్ క్ర‌ష్ గా త‌న‌కు ద‌క్కిన గుర్తింపుతో పాటు పుష్ప శ్రీ‌వ‌ల్లిగా ఉత్త‌రాది యూత్ హృదయాల్లో నిలిచింది. ఇప్ప‌టికే సిద్ధార్థ్ మ‌ల్హోత్రా తో క‌లిసి భారీ వార్ మూవీ `మిష‌న్ మ‌జ్ను`లో న‌టించింది.

ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ తో థ్రిల్ల‌ర్ మూవీ యానిమ‌ల్.. అమితాబ్ సినిమా గుడ్ బాయ్ లో న‌టిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగులు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. ఓవైపు గుడ్ బాయ్ టాకీ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో ఉంది. ర‌ష్మిక త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెబుతూనే.. మ‌రోవైపు యానిమ‌ల్ షూటింగ్ లో పాల్గొంటోంది. ప్రస్తుతం ముంబైలో తన పనిని స‌జావుగా సాగేలా ప్లాన్ చేసింది.

ఒక సోర్స్ ప్ర‌కారం.. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉంది. దీనికోసం ముంబైలోనే నివాసం ఉంటోంది. నగరంలో యానిమల్ షూటింగ్ లో పాల్గొంటోంది`` అని తెలిసింది. ఇటీవల ఢిల్లీలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్యాచప్ సీన్స్ ని చిత్రీకరించి ముంబై షెడ్యూల్ ని ప్లాన్ చేశారు.

ఇంత‌లోనే `గుడ్ బై` డబ్బింగ్ ప్రారంభించి ఇరు చిత్రాల కోసం అటూ ఇటూ ప‌రుగులు పెడుతోంద‌ని తెలిసింది. తదుప‌రి `పుష్ప 2`లో శ్రీ‌వ‌ల్లి కొన‌సాగింపు పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న న‌టించ‌నుంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న `వారిసు`లో న‌టిస్తోంది. తెలుగు త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్ని మ్యానేజ్ చేస్తూనే మ‌రోవైపు హిందీలో వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టించాల‌న్న‌ది ర‌ష్మిక ప్లాన్. దానికి త‌గ్గ‌ట్టుగా చ‌క‌చ‌కా ప‌నుల‌న్నీ చ‌క్క‌బెడుతోంది.