Begin typing your search above and press return to search.

'లైగ‌ర్‌' న‌ష్టాల దిద్దుబాట మొద‌లైందా?

By:  Tupaki Desk   |   1 Sep 2022 9:33 AM GMT
లైగ‌ర్‌ న‌ష్టాల దిద్దుబాట మొద‌లైందా?
X
`లైగ‌ర్‌` న‌ష్టాల దిద్దుబాట మొద‌లైందా?.. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రంగంలోకి దిగి దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ - ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ ల తొలి క‌ల‌యిక‌లో రూపొందిన పాన్ ఇండియా మూవీ `లైగ‌ర్‌`. మిక్స్డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిన ఈ మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోనే డిజాస్ట‌ర్ టాక్ ని సొంతం చేసుకుని షాకిచ్చింది.

సినిమా పై ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు. సినిమా భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతుంద‌ని, కోట్లు కుమ్మ‌రిస్తుంద‌ని ఆశించారు. ఆ కార‌ణంగానే ఈ మూవీని భారీ రేట్ల‌కు బయ్య‌ర్ల‌కు అమ్మారు. అయితే మేక‌ర్స్ భారీ స్థాయిలో డిమాండ్ చేయ‌డంతో కొంత మంది బ‌య్య‌ర్లు వెనక్కి త‌గ్గారు. అయితే కొంత మంది మాత్రం భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకున్నారు.

వ‌రంగ‌ల్ శ్రీ‌ను నైజాం ఏరియా హ‌క్కుల్ని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. దిల్ రాజు, ఎన్ వీ ప్ర‌సాద్ తో పాటు ప‌లువురు ఇత‌ర ఏరియాల కోసం భారీగానే చెల్లించారు.

అయితే ఇప్ప‌డు వారికి `లైగ‌ర్‌` డిజాస్ట‌ర్ తో భారీ న‌ష్టాలు వ‌చ్చాయ‌ట‌. ఆ న‌ష్టాల‌ని తిరిగి చెల్లించాల్సిందేన‌ని ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌ని క‌లిసిశార‌ట‌. నైజామ్ ఏరియా హ‌క్కులే కాకుండా వ‌రంగ‌ల్ శ్రీ‌ను త‌న ద్వారా కొంత మందికి అడ్వాన్స్ మేసిస్ మీద ఏపీలోని కొన్ని ఏరియాల్లో సినిమా ప్ర‌ద‌ర్శ‌న హ‌క్కుల్ని ఇచ్చార‌ట‌.

ఇప్ప‌డు వాళ్లు కూడా అడ్వాన్స్ లు తిరిగి వ‌చ్చేయాల్సిందేన‌ని గ‌ట్టిగా నిల‌దీస్తున్నార‌ట‌. రీసెంట్ గా దిల్ రాజు, ఎన్ వీ ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు పూరిని క‌లిసి ఇదే విష‌యం వెల్ల‌డించడంతో పూరి జ‌గ‌న్నాథ్ లాస్ ల‌ని క‌వ‌ర్ చేసే పని మొద‌లు పెట్టార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే అంటే వ‌చ్చే వారంలో పూరి జ‌గ‌న్నాథ్ బ‌య్య‌ర్స్ తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కాబోతున్నార‌ట‌.

అంతే కాకుండా ఈ మూవీకి ఫైనాన్స్ అందించిన శోభ‌న్ అనే వ్య‌క్తి కూడా ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఏరియాల‌ని అడ్వాన్స్ బేసిస్ కింద ఇచ్చేశాడ‌ట‌. ఇప్పుడు వాళ్లు కూడా తిరిగి అడుగుతున్నార‌ట‌. అయితే ఈ పంప‌కాలు స‌జావుగా సాగుతాయా? లేదా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.