Begin typing your search above and press return to search.

యశోద : రియల్ ఇన్సిడెన్స్.. రీల్ టచ్..!

By:  Tupaki Desk   |   9 Nov 2022 3:39 AM GMT
యశోద : రియల్ ఇన్సిడెన్స్.. రీల్ టచ్..!
X
సమంత నటించిన యశోద మూవీ రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హరి హరీష్ ఇద్దరు దర్శకులు కలిసి చేసిన ఈ మూవీ చాలా స్పెషల్ అంటున్నారు. రీసెంట్ గా సమంత కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని మూవీపై మరింత అంచనాలు పెంచేసింది. ప్రేక్షకులు ఎవరు ఊహించని మలుపులు ఈ కథలో ఉంటాయని చెప్పుకొచ్చారు. సమంత ఈ మూవీలో తన నటనతో పాటుగా యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టేసిందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

సరోగసి మాఫియా నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ ని టచ్ చేస్తూ కల్పిత కథతో వస్తుంది. అయితే యశోద సినిమాలో ప్రధాన పాత్రకి జరిగినవన్ని ఇండియాలో కొన్ని చోట్ల జరిగినట్టు చెప్పుకొస్తున్నారు.

ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అని ఇలాంటి పాయింట్ టచ్ చేయడానికి చాలా గట్స్ ఉండాలని అంటున్నారు మేకర్స్. యశోద సినిమా ముందు చిన్న బడ్జెట్ లో తెరకెక్కించాలని అనుకోగా సమంత రాకతో అది కాస్త పెద్దదిగా మారిందని చెప్పారు.

సినిమా పూర్తయ్యే సరికి దాదాపు 40 కోట్ల దాకా బడ్జెట్ పెట్టినట్టు నిర్మాత చెప్పుకొచ్చారు. సమంత ఉండటం వల్ల సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగిందని అంటున్నారు. సమంత ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డదని.. ముఖ్యంగా తను వ్యాధితో బాధపడుతూ కూడా ఈ మూవీ షూటింగ్ కోసం వచ్చిందని అన్నారు. ఆ టైంలో తన వ్యాధి గురించి ఎవరికి చెప్పకుండా సినిమా కోసం డెడికేటెడ్ గా పనిచేసిందని అంటున్నారు.

సినిమాపై సమంత చూపిస్తున్న ఈ డెడికేషన్ కి అందరు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. సినిమా రిలీజ్ టైం లో లీడ్ రోల్ లో నటించిన తను ప్రమోషన్స్ పాల్గొనకపోతే ఎలా అనుకుందో ఏమో కానీ.. అందుకే ఆరోగ్యం సహకరించపోయినా సరే ఆమె ప్రమోషన్స్ కి ఓకే చెప్పింది. సినిమాలో తన నటనతోనే కాదు భారీ ఫైట్స్ లో కూడా ఆమె సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది.

సమంత మాత్రమే కాదు ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన పాత్రతో మెప్పిస్తారని తెలుస్తుంది. సినిమాలో వరలక్ష్మి నెగటివ్ రోల్ లో కనిపించనున్నారు. మళయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. సినిమాలో పాత్రలన్ని చాలా బలంగా వచ్చాయని.. తప్పకుండా ప్రేక్షకులకు ఈ మూవీ ఓ మంచి అనుభూతిని అందిస్తుందని అంటున్నారు మేకర్స్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.