Begin typing your search above and press return to search.

రాకింగ్ స్టార్ య‌శ్ కొత్త ప్రాజెక్ట్ వ‌చ్చే ఏడాదే!

By:  Tupaki Desk   |   28 Oct 2022 5:33 AM GMT
రాకింగ్ స్టార్ య‌శ్ కొత్త ప్రాజెక్ట్ వ‌చ్చే ఏడాదే!
X
'బాహుబ‌లి' తో వ‌చ్చిన పాన్ ఇండియా క్రేజ్ తో డార్లింగ్ ప్ర‌భాస్ అటుపై క‌థ‌ల ఎంపిక విష‌యంలో పెద్ద‌గా జాగ్ర‌త్త‌లు తీసుకోలేదు అన్న‌ది వాస్త‌వం. సాహోతో యంగ్ మేక‌ర్ సుజిత్ కి అవ‌కాశం ఇవ్వ‌డం..అటుపై రాధేశ్యామ్ తో మ‌రో యువ ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ కుమార్ కి అవ‌కాశం క‌ల్పిచ‌డం ప‌ట్ల ఫ‌లితాల త‌ర్వాత రివ్యూ చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ రెండు ప‌రాజ‌యాలు డార్లింగ్ మార్కెట్ పై కొంత ప్ర‌భ‌వాన్ని చూపుతున్నాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన రెండు సినిమాలు వాటి ద‌రిదాపుల్లో కూడా నిల‌వ‌క‌పోగా నెగివిటీని తీసుకొచ్చాయి. ప్ర‌స్తుతం ఓరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న 'ఆదిపురుష్' పై సైతం ఎన్న సందేహాలున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాలు అభిమానుల్ని అందోళ‌న‌కు గురి చేస్తున్నాయి.

'స‌లార్'...'ప్రాజెక్ట్ -కె ల సంగ‌తి ప‌క్క‌న‌బెట్టి చూస్తే ప్ర‌భాస్ ఇంకా రిస్క్ జోన్ లోనే ఉన్నాడ‌న్న‌ది కొంత మంది బ‌ల‌మైన వాద‌న‌. వీట‌న్నింటిని చూసి క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ సైతం కొంత క‌న్ ప్యూజ‌న్ కి గుర‌వుతున్నాడా? అందుకే త‌దుప‌రి ప్రాజెక్ట్ విష‌యంలో డిలే జ‌రుగుతోందా? బాలీవుడ్ ఆఫ‌ర్ల‌ని సైతం ఆ కార‌ణంగానే హోల్డ్ లో పెడుతున్నాడా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది.

కేజీఎఫ్ -2 త‌ర్వాత య‌శ్ తో సినిమాలు నిర్మించ‌డానికి...ద‌ర్శ‌క‌త్వం వ‌హించిడానికి అన్ని భాష‌ల నుంచి మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ య‌శ్ మాత్రం కంగారు ప‌డ‌లేదు. ఇటీవ‌లే బ్ర‌హ్మాస్ర్త‌-2.. రాకేష్ ఓం ప్ర‌కాష్ మోహ్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న క‌ర్ణ చిత్రాల్లో సైతం య‌శ్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు తెర‌పైకి వ‌చ్చింది. కానీ య‌శ్ మాత్రం ఈ రెండింటిపై అంత‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. బ్ర‌హ్మాస్ర్త కి భారీ ఓపెనింగ్స్ అయితే వ‌చ్చాయిగానీ బ్రేక్ ఈవెన్ కూడా సాధ్యం కాలేదు.

'క‌ర్ణ' లాంటి పౌరాణిక నేప‌థ్య‌మున్న చిత్రంలో న‌టించాలంటే? రిస్క్ అవుతుంద‌న్న సందేహం వెంటాడుతోంది. పైగా రాకేష్ ఓం మెహ్ర కొంత కాలంగా స‌క్సెస్ ల్లోనూ లేరు. ఇలాంటి సందేహాల న‌డుమ బాలీవుడ్ లో అడుగు పెట్ట‌డం ఉత్త‌మం కాద‌ని బ‌లంగా విశ్వ‌శిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వీలైనంత వ‌ర‌కూ కంప‌ర్ట్ జోన్ లోనే సినిమా చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు క‌న్న‌డ వ‌ర్గాలంటున్నాయి.

ముఖ్యంగా రిస్క్ తీసుకుని నార్త్ మేక‌ర్స్ తో సినిమాలు చేయ‌డం క‌న్నా...సౌత్ మేక‌ర్స్ అయితే నే సేఫ్ జోన్ గా ఉంటుంద‌ని భావిస్తున్నారుట‌. ఇటీవ‌ల కాలంలో స‌క్సెస్ రేటు కూడా సౌత్ ఇండ‌స్ర్టీదే బాగుంది. నూరు శాతం క‌థా బ‌లం ఉన్న చిత్రాలు చేసి స‌క్సెస్ లు అందుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో అట్లీ..లోకేష క‌న‌గ‌రాజ్ లాంటి వారితో సినిమా చేస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లోనూ య‌శ్ ఉన్న‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లా ప్రాజెక్ట్ ఆల‌స్య‌మైనా మంచి కంటెంట్ ఉన్న స్ర్కిప్ట్ తోనే ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌న్న‌ది ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో య‌శ్ కొత్త ప్రాజెక్ట్ ప్రక‌ట‌న ఇప్ప‌టిక‌ప్పుడు సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. వ‌చ్చే ఏడాదే ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.