Begin typing your search above and press return to search.

ప్రాన్స్ లో ఇక వీర‌య్య స్వైర విహారం!

By:  Tupaki Desk   |   26 Nov 2022 3:22 PM GMT
ప్రాన్స్ లో ఇక వీర‌య్య స్వైర విహారం!
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో 'వాల్తేరు వీర‌య్య' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్త‌యింది. దీంతో సంక్రాంతి వ‌చ్చేస్తున్నామ‌ని మ‌రోసారి సంకేతాలు పాస్ చేసారు. షూట్ క్లైమాక్స్ కి చేరుకోవ డంతోనే ఇటీవ‌లే బాస్ పార్టీ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ పాట మెగా అభిమానులు స‌హా మాస్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ పాట స‌హా మెగా లుక్ రిలీజ్ తో అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. స‌న్నివేశం చూస్తుంటే బాబి చేసిన ప్రామిస్ ని నిల‌బెట్టుకునే టట్టే క‌నిపిస్తాడు. డైరెక్ట‌ర్ గా కాదు..చిరంజీవి అభిమానిగా ఆయ‌న్ని డైరెక్ట్ చేసి...మెగా అభిమానులు అంచ‌నాలు మించి ఉంటుంద‌న్నారు. ఇప్పుడా మాట‌కు బాబి చేరువ‌లోనే క‌నిపిస్తున్నారు. ఇక బాబి ముందున్న మ‌రో ల‌క్ష్యం అనుకున్న టైమ్కి సినిమా రిలీజ్ చేయ‌డం.

ఆ దిశ‌గానూ వేగంగానే పావులు క‌దుపుతున్నారు. డిసెంబ‌ర్ 15 నాటికి ఎట్టి ప‌రిస్థితుల్లో షూటింగ్ మొత్తం పూర్తిచేయాల‌న్న‌ది ప్లాన్. ఆ ర‌కమైన ప్ర‌ణాళిక‌తోనే బాబి ముందుకు సాగుతున్నాడు.

తాజాగా యూనిట్ ప్రాన్స్ ప్లైట్ ఎక్క‌బోతుంది. రెండు పాట‌ల షూటింగ్ నిమిత్తం టీమ్ ప్రాన్స్ వెళ్తున్న‌ట్లు స‌మాచారం. డిసెంబ‌రు 1న చిరు ఫ్రాన్స్‌లో ఉంటారుట‌.

అక్క‌డ ఓ ప‌ది రోజుల పాటు షూటింగ్ జ‌ర‌గ‌నుందని స‌మాచారం. అక్క‌డ నుంచి తిరిగొచ్చాక ప్యాచ్ వ‌ర్క్ పూర్తి చేస్తారుట‌. అనంత‌రం డిసెంబ‌ర్ చివ‌రి వారం నుంచి ప్ర‌చారం ప‌నులు మొద‌లు పెడ‌తార‌ని స‌మాచారం. అప్ప‌టి నుంచి రిలీజ్ వ‌ర‌కూ సినిమా ప్రేక్ష‌కుల్లో ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌నున్నారు.

గాడ్ ఫాద‌ర్ ప్ర‌చారం విష‌యంలో దొర్లిన త‌ప్పిదాల్ని ఈ సినిమా విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో చోటు చేసుకోకూడ‌ద‌ని ఇప్ప‌టికే చిరు స్ర్టిక్ట్ ఆదేశాలిచ్చారు. దీంతో ఆ బాధ్య‌త‌లు బాబినే తీసుకున్నారు. రిలీజ్ వ‌ర‌కూ అన్ని ప‌నులు తానే ద‌గ్గ‌రుండి చూసుకుంటాన‌ని అన్న‌య్య‌కి మరో మాట కూడా ఇచ్చారుట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.