Begin typing your search above and press return to search.

వీర‌య్య కోసం వెంక‌టేష్ ని దించేస్తున్నారా?

By:  Tupaki Desk   |   12 Sep 2022 5:47 AM GMT
వీర‌య్య కోసం వెంక‌టేష్ ని దించేస్తున్నారా?
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 154వ చిత్రంగా బాబి ద‌ర్శ‌కత్వంలో 'వాల్తేరు వీర‌య్య' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. సినిమా టైటిల్ ని బ‌ట్టే మాస్ కంటెంట్ తో తెర‌కెక్క‌తోన్న చిత్రంగా తెలుస్తోంది. చిరంజీవి పాత్ర ఆద్యంతం ఊర మాస్ గా మ‌లుస్తున్నారు. బాబి మాస్ అభిమానాన్ని మొత్తం రంగ‌రించి చిరు పాత్ర‌ని డిజైన్ చేసారు.

త‌న అభిమాన‌మంతా తెర‌పై క‌నిపించ‌నుంది. వైజాగ్ వాల్తేర్ నేప‌థ్యంలో సాగే స్టోరీలో ఇంకా కొన్ని బ‌ల‌మైన‌ పాత్ర‌లు సైతం క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే చిరంజీవి సోద‌రుడి పాత్ర‌లో మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్నారు. ఆ రెండు పాత్ర‌ల‌త మ‌ధ్య బ‌ల‌మైన ఎమోష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని తెలుస్తోంది. ర‌వితేజ తెర‌పై కనిపించేది కాసేపే అయినా ఉన్నంత‌సేపు ఓ ఊపు ఊపేసి వెళ్లిపోయేలా పాత్ర ఉంటుంద‌ని టాక్.

వీర‌య్య స‌వ‌తి త‌ల్లి కుమారుడి పాత్ర‌లో ర‌వితేజ ఆద్యంతం మెప్పిస్తార‌ని టీమ్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. చిరంజీవి మాస్ రోల్ కి ధీటుగానే ఆ పాత్ర‌ని తీర్చి దిద్దుతున్న‌ట్లు స‌మాచారం. అలా ర‌వితేజ ఎంట్రీతోనే వీర‌య్య సినిమాపై ఊపు రెట్టింపు అయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమాకి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి వైర‌ల్ గా మారింది.

క్లైమాక్స్ లో విక్ట‌రీ వెంక‌టేష్ కూడా న‌టిస్తున్నారుట‌. గెస్ట్ అప్పీరియ‌న్స్ రోల్ కి వెంకీని ఒప్పించిన‌ట్లు స‌మాచారం. మ‌రి ఇందులో వాస్త‌వం తెలియాల్సి ఉంది. ఇదే నిజ‌మైతే వీరయ్య‌కి అద‌న‌పు అడ్వాంటేజ్ గా క‌లిసొస్తుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే చిరంజీవి-ర‌వితేజ లాంటి స్టార్లు భాగ‌మ‌య్యారు. వాళ్లిద్ద‌రికి తోడుగా వెంకీ కూడా రంగంలోకి దిగితే బొమ్మ ద‌ద్ద‌రిల్లిపోదు.

ముగ్గ‌రు హీరోలకు తెలుగు రాష్ర్టాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. కోట్లాది మంది అభిమానులున్నారు. అలాంటిది ముగ్గురు ఒకే తెర‌పై క‌నిపిస్తే స‌న్నివేశం ఎలా ఉంటుంద‌న్న‌ది మాట‌ల్లో చెప్ప‌లేనిది. సినిమా బిజినెస్ పీక్స్ లో ఉంటుంది. మెగాస్టార్ ఇమేజ్ తోనే కోట్ల వ‌ర్షం కురుస్తుంది. ర‌వితేజ‌...వెంకీ స్టార్ డ‌మ్ కూడా తోడైతే రెట్టింపు బిజినెస్ కి ఛాన్స్ ఉంది.

అలాగే చిరంజీవి న‌టిస్తోన్న మ‌రో సినిమా 'గాడ్ ఫాద‌ర్' లో బాలీవుడ్ లో హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ గెస్ట్ అప్పీరియ‌న్స్ తో గాడ్ ఫాద‌ర్ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. మ‌రి ఈ లెక్క‌ల‌న్నీ బేరీజు వేసి చూస్తే వెంక‌టేష్ మెగాస్టార్ కోసం మ్యాకప్ వేసుకున్నా? పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.