Begin typing your search above and press return to search.

వెంకటేష్ 75.. ఆ స్టార్ బ్యూటీ ఫిక్స్?

By:  Tupaki Desk   |   19 Jan 2023 6:32 AM GMT
వెంకటేష్ 75.. ఆ స్టార్ బ్యూటీ ఫిక్స్?
X
సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కామెడీ టైమింగ్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షుకుల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ ను మెప్పించడం ఆయన ఒక్కరికే సాధ్యం. అయితే అటు సీనియర్ హీరోలతో పాటు కుర్రహీరోలకు కూడా గట్టి పోటీని ఇస్తున్నారు. ఎఫ్2 తో పాటు ఎఫ్3 సినిమాలో అద్భుతంగా నటించి మరో రెండు హిట్లను ఆయన ఖాతాలో వేసుకున్నారు.

ప్రస్తుతం ఈయన ల్యాండ్ మార్క్ సినిమాగా వెంకటేష్ 75వ సినిమా రాబోతుంది. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఆయన కెరియర్ లో ఓ మైలురాయిగా నిలవాలని అంతా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో హిట్ 2 సినిమా డైరెక్టర్ శైలేష్ కొలనుతో వెంకీ మామకు ఓ కథ చెప్పారంట. ఈ కథకు వెంకటేష్ ఫిదా అయి ఓకే చెప్పారట. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఫిబ్రవరి నెలలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన కేజీఎఫ్ ఫ్రేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈమె నటించింది మూడు సినిమాల్లోనే అయినప్పటికీ కేజీఎఫ్ రెండు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మూడోది.

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను, హీరో వెంకటేష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టిల చివరి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగానే నిలిచాయి. ఈ ముగ్గురి కాంబోలో రాబోతున్న చిత్రం కూడా అంతకు మించిన హిట్టుగా నిలుస్తుందని చాలా మంది భావిస్తున్నారు.

అయితే డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ 3 సినిమా పనుల్లో బిజీగా ఉంటారని అందరూ భావించినప్పటకీ... ఆయన కొంత గ్యాప్ తీసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది.

హిట్ 1, హిట్ 2 రెండూ ఒకేలా ఉన్నాయని పలువురు కామెంట్లు చేయడంతో.. హిట్ 3 ని అంతకు మించిన రేంజ్ లో తీయాలనుకుంటున్నారు. అందు కోసమే కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలనుకున్నారు ఈ గ్యాప్ లో వెంకీతో సినిమా తీస్తున్నట్లు సమాచారం. వరుస హిట్లు కొట్టాలనే కసితో ఉన్న శైలేష్.. ఈ సినిమాపై ఫోకస్ పెట్టారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.