Begin typing your search above and press return to search.
VD13: అలా ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ?
By: Tupaki Desk | 6 Feb 2023 11:02 AM GMTవిజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన గీతాగోవిందం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఓ విధంగా ఈ సినిమానే విజయ్ దేవరకొండని ఏకంగా స్టార్ హీరోగా మార్చేసింది. చిన్న సినిమాగా వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్ 2లో మొదటి వందకోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమాలో జోడీగా నటించిన రష్మిక ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది.
గీతాగోవిందం తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక గీతాగోవిందం తర్వాత పరశురాం చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ గత ఏడాది సర్కారువారిపాట అనే సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.
కెరియర్ లో చేసినవి తక్కువే సినిమాలే అయిన కూడా మంచి కంటెంట్ బేస్డ్ కథలని ఎంపిక చేసుకొని వాటికి కమర్షియల్ అంశాలు జోడించి సినిమాలు చేయడం పరశురాం శైలి. ఇక సర్కారు వారి పాట తర్వాత నాగ చైతన్యతో మూవీ చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ కూడా అయ్యింది.
అలాగే గీతా ఆర్ట్స్ లో అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తాడని టాక్ వచ్చింది. అయితే ఇవేమీ కాకుండా ఇప్పుడు మళ్ళీ గీతాగోవిందం కాంబినేషన్ సెట్ కావడం విశేషం. విజయ్ దేవరకొండతో మరోసారి పరశురాం సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.
అయితే ఈ మూవీ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతూ ఉండటం విశేషం. దిల్ రాజు ఎప్పుడో విజయ్ దేవరకొండకి తన ప్రొడక్షన్ లో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. అయితే దానిని ఇంద్రగంటి మోహనకృష్ణతో చేయాలాని అనుకున్నాడు.
మరిఏమైందో సడెన్ గా ఆ ప్రాజెక్ట్ కోసం ఇప్పుడు విజయ్ దేవరకొండ వచ్చాడు. ఇక పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రష్మికని హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలతో రష్మిక బిజీగా ఉన్న నేపధ్యంలో బాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దించే ప్లాన్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.