Begin typing your search above and press return to search.

వ‌రుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్‌

By:  Tupaki Desk   |   27 May 2022 4:30 PM GMT
వ‌రుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్‌
X
మెగా హీరో వ‌రుణ్ తేజ్ కు బిగ్ రిలీఫ్ ల‌భించింది. ఇటీవ‌ల సోలోగా 'గ‌ని' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన వ‌రుణ్ తేజ్ కు చేదు అనుభ‌వం ఎదురైంది. దీంతో కొంత నిరుత్సాహానికి గురైన వ‌రుణ్ తేజ్ రెట్టించిన ఉత్సాహంతో 'ఎఫ్ 3' కోసం వ‌ర్క్ చేశాడు. విక్ట‌రి వెంక‌టేష్ తో క‌లిసి న‌టించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం మే 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ తొలి రోజే మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

విక్ట‌రీ వెంక‌టేష్ ఈ మూవీకి లైఫ్ లైన్ గా నిల‌వ‌గా వ‌రుణ్ తేజ్ త‌న‌దైన కామెడీతో ఆక‌ట్టుకున్నాడు. త‌మ‌న్నా, మెహ్రీన్‌, సునీల్, సోనాల్ చౌహాన్ త‌మ త‌మ పాత్ర‌కు పూర్తిగా న్యాయం చేశారు.

ఫుల్ ఆఫ్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ టీమ్ అందిరికి మంచి విజ‌యాన్ని అందించింది. ఈ మూవీ అందించిన విజ‌యంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న వ‌రుణ్ తేజ్ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ ని అందించాడు.

'ఎఫ్ 3' త‌రువాత వ‌రుణ్ తేజ్ క్రేజీ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ష‌న్ లో ఓ భారీ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని హీరో వ‌రుణ్ తేజ్ తాజాగా వెల్ల‌డించారు.

ప్ర‌వీన్ స‌త్తారు డైరెక్ష‌న్ లో చేయ‌నున్న మూవీలో త‌న పాత్ర 'ఎఫ్ 3' లో పోషించిన పాత్ర‌కు చాలా భిన్నంగా వుంటుంద‌న్నాడు. ఇదొక యాక్ష‌న్ డ్రామా అని, సినిమా అంతా దాదాపు లండ‌న్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని చెప్పుకొచ్చారు.

ప్ర‌వీణ్ స‌త్తారు 'పీఎస్వీ గ‌రుడ‌వేగ' చిత్రంతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కింగ్ అక్కినేని నాగార్జున తో 'ది ఘోస్ట్‌' పేరుతో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌కెక్కిస్తున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇటీవ‌లే దుబాయ్ లో ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేసిన ప్ర‌వీణ్ స‌త్తారు ప్ర‌స్తుతం మిగ‌తా సీన్ ల‌ని పూర్తి చేస్తున్నారు. ఇదిలా వుండ‌గానే వ‌రుణ్ తేజ్ తో కొత్త సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు.